21 C
Hyderabad, IN
Sunday, February 25, 2018

మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం1,2,3,4 పాదాలు, ధనిష్ట 1,2 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

18 Feb, 2018 to 24 Feb, 2018

పనుల యందు సహనంతో వ్యవహరించినప్పటికిన్నీ ప్రతిఫలాపేక్ష లేనిదే ముందడుగు వేయుట కష్టతరం కాగలదు. ఇతరులు చెప్పిన మాటలు వినుట వలన జీవితభాగస్వామితో అభిప్రాయభేదములు పొడసూపగలవు. వారం ఆఖరులో జీవితభాగస్వామి మాటవినకపోవుటచే మనోవేదనలు వుండగలవు. కుటుంబమునకు అవసరమైన సదుపాయాములు సమకుర్చుటలో ఆసక్తి కనపరచెదరు. వృత్తి, వ్యాపారాదులలో ప్రతిభకు తగిన గుర్తింపు లభించగలదు.

February

మాస ప్రారంభంలో కొన్ని కొన్ని సమయాలల్లో స్వార్ధపూరితమైన నిర్ణయములు తీసుకొనుట వలన మనశ్శాంతి కొరవడగలదు. పనుల యందు ఆటంకములు ఎదురగుట విసుగు, చికాకులుగా ఉండగలదు. జీవితభాగస్వామి నుండి సహకార లోపములు ఎదురగుట మరియు మనస్పర్ధలు చోటుచేసుకోనుట వలన అసహనం వ్యక్తం చేయుదురు. కొంత పరిస్థితులలో అనుకులమైన మార్పులు వచ్చినప్పటికిన్నీ అసంతృప్తులను చూపెదరు. వృత్తి, వ్యాపారాదుల యందు పేరు, ప్రఖ్యాతులు ఎదురుకాగలవు. వ్యవహారముల యందు గురువులు, అనుభవజ్ఞులైన వారి సహకారములు అందగలవు. మాస మధ్య నుండి ఇప్పటి వరకు ఎదురైనా శ్రమల నుండి కొంత ఉపశమనం కలుగగలదు. కాని ఆర్ధికపరమైన ఒడిదుడుకులు ఎదురైనప్పటికిన్నీ ఖర్చులకు సరిపడా ధనం సమకూరగలదు. పట్టుదలలు మాత్రం విడిచిపెట్టరు. కుటుంబ వాతావరణం కొంత అలజడులుగా ఉండగలవు.

ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆర్ధికంగా పురోగతిని సాధిస్తారు. మీకున్న పలు వనరుల ద్వారా ఆదాయం చేకూరును. మీరు చేసే వృత్తి , వ్యాపారం, మరియు వ్యవసాయ మూలకంగా రాబడి ఉండును. ఉద్యోగులకు హోదా పెరుగును, అధికారుల వలన సమయానికి సహకారం అందును. ఉద్యోగరిత్యా మానసిక ఆందోళనలు మరియు చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున తగు జాగ్రతలు తీసుకోవలెను. వ్యాపారస్తులకు లాభాలు నిలకడగా ఉండును. షేర్ మార్కెట్లో మదుపరులు మంచి లాభాలను గడిస్తారు, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది . కొన్నిసార్లు చిన్న చిన్న ఆరోగ్యవిషయాలలో తగు జాగ్రతలు తీసుకోవలెను. ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకోవలెను. మీ కుటుంబసభ్యులతో ఏర్పడే సమస్యలను, మీకున్న సమయస్పూర్తితో పరిష్కరించుకొగలరు. ఒక్కోసారి ఒత్తిడి వలన మీ మానసిక ప్రశాంతత లోపించును. మీకు బంధుమిత్రుల వలన నష్టం వాటిల్లును. మీరు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం తీర్థయాత్రలకు మరియు వృత్తిరిత్యా చేసే ప్రయాణాలకు అనుకూలంగా ఉండును. మీరు కొన్ని సందర్బాలలో దృడమైన నిర్ణయం తీసుకుంటారు. జీవితం ఉన్నతంగా సాగిస్తారు. మీయొక్క గౌరవ మర్యాదల విషయాలలో పురోగతిని సాధిస్తారు.

Loading…

సరికోత్తగా

STAY CONNECTED

263,096FansLike
893FollowersFollow
160FollowersFollow
593SubscribersSubscribe