రాముడికంటే రావణుడు గొప్పవాడ?

3
11289

ramayana-yuddha-kanda-1

“రావణాసురుడు ఉత్తముడు.

తనచెల్లిని అవమానించినందుకు రామునిభార్యను అపహరించాడు.

సీతను అపహరించినా ఆమెను తాకలేదు.

దూతను చంపకూడదని హనుమంతుని విడిచిపెట్టాడు.

తమ్మడు తననుండి దూరమై వెళ్ళినా సహించాడు.

రాముడు తనభార్యను అనుమానించి, అవమానించి వదిలిపెట్టాడు.” అంటూ రాముడికంటే రావణుడే గొప్పవాడు – అని ఈ మధ్య కొన్నిబృందాలు వ్యాసాలు వ్రాస్తున్నాయి. వీటికి సమాధానం ఏమిటి అని ఒక భక్తుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిని కోరగా వారు ఈ విదముగా సమాధానం ఇచ్చారు”

అర్థంలేని వ్యర్థ ప్రలాపాలు చాలాకాలంనుండి ఉన్నవే. వాటికి సమాధానాలుకూడా ఉన్నాయి. కానీ మనలో చాలామందికి రామాయణ పరిజ్ఞానంలేదు. దానిపై గౌరవంలేదు. కాసింత అవగాహన ఉన్న వాళ్ళుకూడా పై కువిమర్శలకు సమాధానం చెప్పగలరు. ఆ అవగాహన సైతం మన సమాజంలో కొరవడు తున్నందుకు బాధపడాలి.

Back

1. రావణుడి చెల్లిని (శూర్పణఖను) అవమానించినందుకు రామునిభార్యను అపహరించాడ?

రావణుడి చెల్లిని (శూర్పణఖను) రాముడు పనికట్టుకుని వెళ్ళి అవమానించలేదు. పరపురుష వ్యామోహంతో ఆ రాక్షసివచ్చి తన కాముకత్వాన్ని బయటపెట్టింది. అంతేకాదు సీతమ్మను చంపబోయింది. తమంతతాము వచ్చి హింసించబోయే ఎవరినైనా ఎవరైనా శిక్షించడం సహజం. అందునా చంపకుండా కేవలం అవమానించి వదిలివేయడం శ్రీరామ లక్ష్మణుల ఔదార్యం. తరువాత వేలమంది రాక్షసుల మూకను వెంటబెట్టుకు వచ్చింది శూర్పణఖ. అప్పడు విల్లందుకున్న రాముడు తన పరాక్రమంతో వారిని మట్టుబెట్టాడు. అలాంటి శూర్పణఖను వెనకేసుకువచ్చిన వాళ్ళు ఉన్నారంటేనే ఆశ్చర్యం. వారి సంస్కారాలు ఎంత జగుప్సాకరమైనవో అర్ధమౌతాయి.

Back

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here