శ్రీ దుర్గ దేవి అలంకరణ

0
8161

1. శ్రీ దుర్గ దేవి అలంకరణ

28/09/2017 – గురువారము
ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి)
ఎనిమిదవ రోజు శ్రీ దుర్గా దేవి అమ్మవారి అలంకరణ (కుజ + రాహు)
ఎరుపు చీర (కుజుడు,బుధుడు)
పేలాలు పాయసం నైవేద్యం (రాహువు, శుక్రుడు, చంద్రుడు)

2. పటించవలసిన మంత్రములు

 

దుర్గాష్టకం

ఉద్వపయతునశ్శక్తి మాదిశక్తే ద్దరస్మితమ్ తత్వం
యస్యమాహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః 

జ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్య్యమనవస్దీతిః 

దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా

శివాభవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్‌ ప్రదృశ్యతే 

పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్‌ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః 

వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణియతేపరా

భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః 

ఫలశ్రుతి

యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్

8 పర్యాయములు స్మరించవలెను.
పై మంత్రము సాద్యము కానీ వారు
ఓం దుం దుర్గాయై నమ:  అనే మంత్రమును 108 జపించవలెను .

3. ఎవరు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

ఈ  రోజు అమ్మవారిని సశాస్త్రీయముగా పూజించడము వలన జాతకములలోని కుజ ,రాహు క్షీణ / నీచ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గును. తద్వారా

  • ఆకస్మిక గండములనుండి విముక్తి కల్గును .
  • వైవాహిక సమస్యలు తొలగి కుటుంబములో కలతలు తగ్గుతాయి .
  • రాహు గ్రహము వలన ఏర్పడిన వ్యసనముల నుండి విముక్తి లభించు అవకాశము కలదు .
  • తీవ్రమైన మానసిక ఆందోళనతో బాదపడుట / డిప్రెషన్ / భయము / ఉన్మాదము వంటి సమస్యల నుండి ఉపశమనము లబించే అవకాశము ఉన్నది .ఎందుకనగా వీటన్నింటికి కారణం వారి వారి జాతకములలోని చంద్ర, కుజ, రాహు గ్రహముల ప్రభావమే అని ఘంటా పదముగా చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలున్న వారు ఈ రోజు దుర్ఘా దేవి ని సశాస్త్రీయం గా పూజించుట అత్యంత శ్రేష్ట దాయకము .
  • అనవసర ధన వ్యయం ( శుక్ర ,చంద్ర /కుజ ) తగ్గును.
  • వివాహము ఆలస్యములు తొలగి సకాలములో వివాహము జరుగును.

రాఘవేంద్ర. ఏం.ఏ. జ్యోతిష్యం.స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here