23 C
Hyderabad, IN
Wednesday, October 18, 2017

వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

15 Oct, 2017 to 21 Oct, 2017

ఈ రాశి వారికి ఈ వారం ఆర్ధిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండును. ఉద్యోగస్తులకు వారి ఉన్నతాధికారుల వలన ఉన్నత పదవిని పొందే అవకాశం ఉన్నది. మీ కుటుంబసభ్యుల గురుంచి జాగ్రతలు తీసుకోవలను లేనిచో మానసిక ఆందోళనకు అవకాశాలు ఉన్నాయి. బందుమిత్రుల నుండి శుభవార్త వింటారు. ఆరోగ్య పరమైన విషయాలలో తగు జాగ్రతలు తీసుకోవలను.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్ధికంగా పురోగతి ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండును. మీ అవసరాలకు ఆస్తులను అమ్మవలసి వచ్చును. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. షేర్ మార్కెట్లో మదుపరులకు మంచి లాభాలను తెచ్చిపెట్టును. ఉద్యోగులకు పదోన్నతి పొందేందుకు అవకాశాలున్నాయి. నెలసరి జీతం పెరిగును అంతేకాకుండా ఇతర అలవెన్సులు కలసివచ్చును. మీరు ఉహించని విధంగా దూరప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. మీరు పనిచేసే చోట అజ్ఞాత శత్రువుల వలన ప్రతికూల వాతావరణం ఏర్పడును. మీ ఆరోగ్యం నిలకడగా ఉండును. కొన్ని సందర్బాలలో హాస్పిటల్ సందర్శిచవలసి వచ్చును. దీర్గకాళిక వ్యాదులకు శ్రద్ద వహించవలెను. అనుకోకుండా ఆక్సిడెంట్ వలన శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి. మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతారు. మీయొక్క తల్లితండ్రుల వృద్దాప్యం కారణంగా వ్యతిరేక ఆలోచనలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సంవత్సరం తీర్థయాత్రలు చేసేందుకు ప్రయత్నాలు జరుగును. ఇంట్లో శుభకార్యాలు జరుగును. ప్రేమలో ఉన్నవారికి వివాహం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గౌరవ మర్యాదల విషయాలలో అభివృద్దిని సాధిస్తారు.
Loading…

సరికోత్తగా

STAY CONNECTED

262,556FansLike
655FollowersFollow
150FollowersFollow
526SubscribersSubscribe