కాటుక ఎందుకు ధరిస్తారు?

0
5665

why to use eyeliner-HariOmeమానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి. ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం

కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు!

Back

1. స్త్రీలు కాటుక ఎందుకు ధరిస్తారు?

కాటుక అనేది స్త్రీలకు ఉన్న సుమంగళ ద్రవ్యములలో ఒకటిగా చెప్పబడినది. స్త్రీలు వారి ఐదవతనమును కొరకు కాటుక ధరిస్తారు. సూర్య కిరణాలు నీరుగా పడడంవల్ల కంటికి హాని కలుగుతుంది. కాటుక ధరించడం వల్ల కంటికి చలువ చేస్తుంది కనుక సూర్య కిరణాలు పడినను కంటికి ఎటువంటి హాని కలుగదు. కాటుక యొక్క మహిమను శ్రావణమంగళవారము నోములో  తెలిపియున్నారు.

కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం! ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వల్లే కనుగుడ్డు ఎటు కదులుతోందో? మనిషి కళ్లు పలుకుతున్న భవాలు ఏమిటో? తెలుస్తాయి. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని పూయడం వల్ల కళ్ల పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు.

Promoted Content
Loading...
Back

LEAVE A REPLY