అవాంచిత రోమాలు తగ్గడానికి

0
4193

10628431_982509548431694_3715880744118644921_nపచ్చి పాలలో పచ్చి పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుంది, ఎండలో తిరగడం వలన నల్ల బడిన చర్మం తిరిగి తెల్లబడుతుంది. అంతేకాక ఇందులో పసుపు ఉండడం వలన ముఖం పై ఉండే అవాంచిత రోమాలను ఇది తొలగిస్తుంది.

పచ్చి బొప్పాయి, అలొవెర (కలబంద) జెల్‌, శెనగపిండి, పసుపులను కలిపి శరీరానికి రాసుకోవాలి. బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ కుదుళ్లలోకి వెళ్లి రోమాలు పెరగకుండా చేస్తుంది. ఇదేకాకుండా శెనగపిండి, పాలు, పసుపులను పేస్ట్‌లా చేసి వాడినా ఫలితం కనిపిస్తుంది.

పంచదార, నిమ్మరసం, తేనెల మిశ్రమాన్ని వాడినా అవాంఛితరోమాలు తొలగించుకోవచ్చు. పంచదారనునీటితో కలిపితే, ఇది మంచి ఎక్స్ ప్లోయేట్ గా పనిచేస్తుంది. నిమ్మరసం ఒక అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. అవాంఛితరోమాలను శరీరం నుండి తొలగిస్తుంది.

గుడ్డు తెల్లసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మాస్క్‌లా వేసుకున్నా ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. మాస్క్‌ లాగుతున్నప్పుడు అవాంఛిత రోమాలు దాంతోపాటు ఊడి వచ్చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here