
ఆరోగ్యం కోసం నిమ్మ రసం | Lemon Juice
నిమ్మరసాన్ని రోజు ఉదయాన తీసుకోవటం వలన, తాజాగా ఉంటారు మరియు రోజు మొత్తం చురుకుగా ఉండేలా చేస్తుంది –
వేసవికాలంలో నిమ్మ రసం ఎక్కువగా తాగుతాము. కారణం డీ హైడ్రేషన్’కు అనుగుణంగా దేహాన్ని ఉంచుతుంది. కానీ కాలాలకు సంబంధం లేకుండా, రోజు ఉదయాన నిమ్మరసంతాగటం వలన ఆరోగ్యం పెంపొందించబడుతుంది.
బరువు తగ్గాలి అనుకున్న వారు రోజు ఉదయాన నిమ్మరసాన్ని తాగటం వలన బరువు సులభంగా తగ్గుతారు
రోగనిరోధక శక్తికి బలాన్ని చేకూరుస్తుంది
విటమిన్ ‘C’ మరియు ‘బయోఫ్లావనాయిడ్స్’లను నిమ్మరసం పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి శరీర నిరోధక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది. చైతన్య వంతంగా ఉండటానికి కావలసిన పోషకాలన్ని నిమ్మరసం పుష్కలంగా కలిగిఉంటుంది
.ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకు ఎక్కువ గా వాంతులు అవుతాయి.అలాంటి వాళ్ళు నిమ్మ వాసనా చూస్తూ ఉంటె వాంతులు తగ్గించవచ్చు
రోజు ఉదయాన నిమ్మరసాన్ని తాగటం ప్రారంభించిన తరువాత, మీ చర్మంలో కలిగే మార్పులను గమనిచండి. నిమ్మరసంలో ఉన్న మూలకాలు ముఖం పైన ఉన్న మచ్చలను, నల్లటి వలయాలను, మొటిమలను తోలగిస్తుంది.
వేడి బాగా ఎక్కువ ఉన్నవాళ్లు క్రమం తప్పకుండ నిమ్మ రసం తాగితే మార్పు కనపడుతుంది
నిమ్మరసం తాగటం వలన మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగిన స్థాయిలో ఏర్పడకుండా ఉండేలా చేస్తుంది. మీ శరీరాన్ని ఎల్లపుడు తేమబరితంగా ఉంచి, మూత్ర ప్రసరణను సజావుగా ఉండేలా చేస్తుంది. ఇలా దీని వలన మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడవు
వడదెబ్బ తగిలిన వాళ్ళు గ్లాసు నీళ్ళలో కొంచం నిమ్మరసం,తగినంత ఉప్పు లేదా చక్కర కలుపుకొని తాగితే వడదెబ్బ వెంటనే తగ్గిపోతుంది నిమ్మరసం క్యాన్సర్ నివారణ కారకాలను కలిగి ఉంటుంది అని చాలా రకాల పుస్తకాలలో తెలిపారు. ఈ కారకాలు క్యాన్సర్’ను కలిగచేసే వ్యాధి కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. అంతేకాకుండా, నిమ్మకాయ రసంలో ఉండే పొటాషియం స్థాయిలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
. నిమ్మలో కాల్షియమ్ ఉండటం వలన బహిష్టు ఆగిపోయిన మహిళలకు నిమ్మ రసం ఎంతో మేలు చేస్తుంది.
అరగ్లాసు వేణ్నీళ్లలో చెంచా తేనె, చెంచా నిమ్మరసం వేసుకుని తాగాలి. వేడిగా ఉండగానే కొద్దికొద్దిగా తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. అరగ్లాసు పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేసి తాగితే గొంతునొప్పి అదుపులో ఉంటుంది. గొంతునొప్పితో పాటూ జలుబూ ఉంటే అరగ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగాలి.