అవిసె నూనెగింజలను మొదట నూనెతీయుయంత్రాలలోఆడించి నూనెను తీయుదురు
అవిసె నూనె వాడితే ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు.
కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.
మెనోపాజ్ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి.
అవిసె గింజలు మెదడుకు శక్తిని పెంచే ఆహారం. వీటిలో ఉండే ప్యాటీయాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెషన్‌ను కూడా సమర్థవంతంగా నివారించ గలుగుతాయి.
అవిసెలో పీచు అధికంగా లభిస్తుంది. కనుక మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. .
సూర్య కిరణాల వేడికి చర్మం దెబ్బతినకుండా ఈ గింజల నుండి తీసే నూనె రాసుకోవడం వలన చర్మరక్షణ లభిస్తుంది.
రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లభిస్తుంది.
చుండ్రు సమస్యను సమర్థవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.
అవిసె నూనెను వేడి చేస్తే దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడాలి.
తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమాయం.
అలాగే నడివయసులో వచ్చే కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు కూడా అవిసె నూనెతో చేసిన వంటకాలు వాడుతుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు
.అవిసె నూనెలో విటమిన్ ‘ఈ’ పుష్కలంగా ఉంది. కుష్టువ్యాధితో బాధపడేవారికి ఈ నూనెను వంటలలో ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
కాలిన గాయాలపై అవిసె నూనె నురగను పూస్తే మంట, నొప్పినుంచి ఉపశమనం కలగుతుంది. అవిసె ఆకును వేంచుకుని మేక పాలలో ఉడకబెట్టుకుని ఆలేపనాన్ని పుండ్లపై పూస్తే పుండ్లు, కురుపులుంటే మటుమాయమవుతాయి.
thanq very use full