ఆరోగ్యపరంగా నువ్వులు

0
1702

sesame-seedsనువ్వులు శరీరానికి కావలసిన పోషకాలను మరియు నువ్వుల నూనె వలన చర్మ రక్షణ, జుట్టు రాలకుండా నివారిస్తాయి. నువ్వుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
1మధుమేహ వ్యాధి నివారణ
నువ్వులలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయడతాయి. నువ్వు విత్తనాల నుండి తీసిన నూనెలు శక్తివంతమగా శరీర రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.

2గుండె సంబంధిత అవయవాల ఆరోగ్యం
నువ్వులతో చేసిన నూనెలను వాడటం వలన అథెరోస్క్లెరోటిక్ గాయాల నుండి ఉపశమనాన్ని తగ్గిస్తుంది. నువ్వులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే మూలకాలు, యాంటీ-అథెరోస్క్లెరోటిక్ గుణాలను కలిగి ఉండి హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నువ్వులు మొనోశాకరైడ్’లను కలిగి ఉండి కరోనరీ ధమని వ్యాధులు శక్తి వంతంగా తగ్గించి మరియు శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి
3కీళ్ళ నొప్పులు
నువ్వులు కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్’లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి
4ఎముకల ఆరోగ్యం
నువ్వు విత్తనాలు జింక్ మూలకాలను కలిగి ఉండి, శరీరంలో మినరల్’ల స్థాయిలు పెంచి, ఎముకల్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ మూలకాల లోపం వలన నడుము మరియు వెన్నెముక భాగాలలో ‘బోలు ఎముకల వ్యాధి’ (ఒస్టియోపోరోసిస్) కలుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరం అయ్యే కాల్షియం వంటి మినరల్స్’లను ఇది పుష్కలంగా కలిగి ఉంటుంది.
5కొవ్వు పదార్థాల తగ్గుదల
నువ్వులలో కొన్ని సమూహాల ఫైబర్’లను కలిగి ఉంటాయి వీటిని ‘లిగ్నిన్స్’ అంటారు. ఈ రకమైన ఫైబర్’లు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి. నల్ల నువ్వులలో కొవ్వు పదార్థాలను పోలిన ‘ఫైటోస్టేరోసిస్’ అనే మూలకాలను కలిగి ఉంటాయి. ఈ నల్ల నువ్వులను తినటం వలన శరీర రక్తంలో ఉండే కొవ్వు స్థాయిలను తగ్గించి మరియు వివిధ రకాల క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి.
6పోషణ
నల్ల నువ్వులు శక్తివంతంగా శక్తిని పెంచుటలో సహాయపడతాయి, మెదడుకు కావలసిన పోషకాలను అందించి వయసు పెరుగుదలను తగ్గిస్తుంది. రోజు నువ్వులను తినటం వలన వెన్నునొప్పి, కీళ్ళ నొప్పుల లక్షణాలను తగ్గించి మరియు కీళ్ళను ద్రుడపరుస్తాయి
7సూర్యుడి వేడి
సూర్య కిరణాలకు చర్మం బహిర్గతమైనపుడు చర్మ కణాలు ప్రమాదాలకి గురవుతాయి, నువ్వులను తినటం వలన చర్మ కణాలకు కలిగే సమస్యలను తగ్గిస్తుంది. U.V కిరణలకు బహిర్గతమైనపుడు చర్మ కణాలకు కలిగే మరకలను, మచ్చలను నువ్వులలో ఉండే మూలకలు శక్తి వంతంగా తగ్గిస్తాయి. రోజు నువ్వుల నూనెలను వాడటం వలన చర్మ క్యాన్సర్’ల నుండి ఉపశమనం పొందుతారు.
8స్కిన్ డిటాక్సిఫయర్
నువ్వులు యాంటీ-ఆక్సిడెంట్’లను కలిగి ఉండి, చర్మం డిటాక్సిఫైయింగ్ చెందకుండా సహాయపడతాయి. ఒక కప్పు నువ్వుల నూనె మరియు సగం కప్పు ఆపిల్ సైడర్ వినిగర్ మరియు నీటిని కలపిన మిశ్రమాన్ని రోజు పడుకోటానికి ముందుగా మీ ముఖానికి పూయటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు.
9డీప్ కండీషనింగ్
నువ్వుల నూనెను పొడిగా ఉండే జుట్టు, తలపైన చర్మానికి, రసాయనాలతో ప్రమాదానికి గురైన జుట్టుకి చికిత్స చేయటానికి కండిషనర్’గా వాడవచ్చు. ఇది జుట్టుకి ఆరోగ్యాన్ని చేకూర్చి, తేజస్సుని అందిస్తుంది.
10 తలపైన ఉండే చర్మ సమస్యలు
నువ్వులు తల పై చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన విటమిన్’లను, మినరల్స్ మరియు పోషక విలువలను పుష్కలంగా కలిగి ఉంటాయి. మీ జుట్టు రాలిపోతుండా.. జుట్టు పొడిగా మారి సమస్యలకు గురి చేస్తుందా.. నువ్వుల నూనెను రోజు తల పైన మసాజ్ చేయటం వలన ఇలాంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా, నువ్వుల నూనె యాంటీ-ఫంగల్, యాంటీ-బ్యాక్టీరియా మరియు యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం వలన తల పైన చర్మానికి కలిగే ఇంఫెక్షన్ మరియు చూండ్రు వంటి సమస్యలను తోలగిస్తుంది

.courtesy-https://www.facebook.com/Vijayapadham/photos/a.570189099721621.1073741828.569744769766054/983044431769417/?type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here