ఉపిరితిత్తుల బలహీనతకు నివారణా మార్గాలు

1
5308
12670037_1703852329897056_3404853889898013326_n
ఉపిరితిత్తుల బలహీనతకు నివారణా మార్గాలు

కొంతమంది అతిగా ధూమపానం చేయడం , ఉబ్బసం , క్షయ , ఉపిరితిత్తుల కాన్సర్ మొదలయిన భయంకరమయిన జబ్బులకు గురి అయినప్పుడు వారి యెక్క ఉపిరితిత్తులు చాలా బలహీనతకు లోనవుతాయి. వారికోసం ఇప్పుడు నేను చెప్పబోయే రసాయనం చాలా అధ్బుతంగా పనిచేస్తుంది . ఇందులో ఉపయొగించే మూలికలు చాలావరకు ఆయుర్వేద మూలికా దుకాణాలు లొ దొరుకుతాయి. మరి కొన్ని గ్రామాలలో ఎవరిని అడిగినా యిట్టె చెప్పేస్తారు.

తయారీ విధానం –

తాజాగా ఉండే నల్లద్రాక్ష పండ్లు తెచ్చి బాగా కడిగి నీరు వంచి శుభ్రమైన చేతులతో పిసకాలి. తరువాత శుభ్రమైన గుడ్డలో వడపోసి రసం తీసుకోవాలి . ఆ రసం 16 కిలొలు ఉండాలి. అందులో 3 కిలొల పటికబెల్లం చూర్ణం 3 కిలొల మంచి తేనే కలిపి శుభ్రమైన కొత్తకుండ లొ పోయాలి. అందులొ ఇంకా ఒక్కొటి 25 గ్రాముల చొప్పున నాగకేసర చూర్ణం , దొరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం , శుద్ది చేసిన చిత్రమూలం చూర్ణం , వావిలి గింజల చూర్ణం , ఆకుపత్రి చూర్ణం , యాలుకల చూర్ణం , దాల్చినచెక్క చూర్ణం దోరగా వేయించిన మిరియాల చూర్ణం , లవంగాల చూర్ణం , జాజికాయల చూర్ణం పోసి కుండపైన మూకుడుతో మూసి వాసిన కట్టు కట్టాలి. పదార్దాలు కుండలో నిండుగా ఉండకూడదు . కుండలో నాలుగో వంతు ఖాళీగా ఉండాలి. కుండ మూతకు శీల మన్నుతో లేపనం చేయాలి .

తరువాత ఎండాకాలం లొ అయితే 3 వారాల పాటు , వర్ష, శీతాకాలలో అయితే ఒక నెలరొజుల పాటు ఆ కుండను ఒక మూలగా కదిలించకుండా భద్రపరచాలి. పైన తెలిపిన సమయానికి కుండలో పదార్దాల మద్య రసయనిక చర్య జరిగి ఆ పదార్దం అంతా అద్బుతమైన అమృత రసాయనం అవుతుంది. తరువాత మూత తీసి కుండలోని పదార్థాన్ని కదలకుండా పై పై తేట నీళ్లని వేరే పాత్రలోకి వంచుకోవాలి.ఈ రసాయనాన్ని గాజు సీసాల్లో నిలువ ఉంచుకొవాలి. పూటకు 25 గ్రాముల మోతాదుగా రోజు రెండుపూటలా సేవించాలి .

ఉపయొగాలు –

* ఉపిరితిత్తులు బలహీనత తగ్గిపొతుంది.

* సహజశక్తి కలుగుతుంది.

* రక్తం శుభ్రపడి కొత్తరక్తం పుడుతుంది.

* ఆస్తమా , క్షయ , ఉపిరితిత్తులు కాన్సర్ , అజీర్ణ రోగులుకు ఇది అమృతం కన్నా ఎక్కువుగా పనిచేస్తుంది .

* శరీరానికి ధృడమైన , శాశ్వతమైన బలం , యవ్వనం , రంగు లభిస్తాయి.

* శరీరకాంతి, బుద్ధిబలం, వీర్యవృద్ధి , కళ్లకు చలువ కలుగుతాయి.

పైన చెప్పిన మూలికలు, చూర్ణం లు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అవుతాయి.

 

** కాళహస్తి వెంకటేశ్వరరావు **

https://www.facebook.com/ayurvedhamoolikaarahasyaalu/photos/a.1690468414568781.1073741827.1690453367903619/1703852329897056/?type=3&theater

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here