
కిడ్నీలోని రాళ్లు నివారించడానికి టిప్స్ | kidney stone cure tips in Telugu
కీరా మూత్ర పిండాల పనితీరుకు దోహద పడుతుంది. యూరిక్ యాసిడ్ నియంత్రించే గుణము కీరా దోస లో ఉండటం వలన మూత్రపిండాలాలో రాళ్ళు ఏర్పడవు.
రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగాలి
.వ్యాయామం అవసరం. కాల్షియం పదార్థాలు పాలు, వెన్న, నెయ్యి, పాల ఉత్పత్తులు, టమాట, పాలకూర, క్యాబేజి వాడకం తగ్గించాలి.
కిడ్నీ ఫెయిల్యూర్‌లో పొటాషియం ఎక్కువ ఉంటే కొబ్బరి నీళ్లు తాగకూడదు. కిడ్నీలో రాళ్లు రాకుండా ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి.
ఇతర ద్రవపదార్థాలు ఎక్కువశాతం తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి.
కనీసం ఆర్నెళ్లు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వారు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది.
అయితే, చల్లని నీరు గానీ, ఇతర చల్లని పానీయాలు గానీ తీసుకోకూడదు. ఈ క్యాల్షియం రాళ్ళు ఉన్న వారు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఈ ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు
కొండపిండి మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటితో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30 మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడుపూటలా తీసుకోవాలి. లేకుంటే కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకు తినటం అలవాటు చేసుకోవాలి. మూడునెలల తర్వాత కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి ఆ మేరకు అవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది.
– ఉలవల్లో ముల్లంగి ఆకులు సన్నగా తరిగి కలిపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారు రోజూ తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
ఆరెంజ్ జ్యూస్కు క్యాల్షియం ఆక్సలేట్ ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది.
కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్లను ఎక్కువగా తీసుకోకూడదు. తెల్ల గలిజేరు వేరును నీటిలో మెత్తగా నూరాలి.
ఒక కప్పు నీటిలో ఒక రోజు రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే వడబోసి తర్వాత తాగాలి.
దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.
.ఫైనాపిల్ జ్యూస్ ,నిమ్మరసం ,అరటి ,క్యారెట్ ,కాకర మొదలైనవి మళ్లీ రాళ్లు రాకుండా కాపాడతాయి
. కిడ్నీ లో స్టోన్స్ ఉండి నెప్పి గాని ఇంకా వేరే బాధలు గాని తగ్గాలంటే తులసి విత్తనాలు జీలకర్ర కలిపి పొడి చేసుకుని దీనిలో పటికబెల్లం పొడి కలిపి వేడి పాలలో కలిపి తాగితే బాధలు తగ్గుతాయి
. గమనిక: కిడ్నీల్లో రాళ్లు బాగా పెద్దవిగా ఉన్నా, అవి బయటకు రావటం వీలుకాని సందర్భాల్లో ఆయుర్వేద వైద్యులను సంప్రదించటం మంచిది.
Gal blader stones ki cheppandi please.