దగ్గును త్వరగా తగ్గించే. సహజ సిద్దమైన ఇంటి చిట్కాలు

0
5566

11-coughదగ్గేటప్పుడు పొట్ట నుంచి ధమనుల వరకు అన్నీ షేక్ అవుతాయి. దీనివల్ల శరీరమంతా నిస్సత్తువకు లోనవుతుంది. మనిషినంతటినీ అల్లాండిచేస్తుంది దగ్గు

దగ్గు తగ్గడానికి మార్కెట్ లో దొరికే సిరప్ లను తాగడం కంటే.. ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకోవడం వల్ల పిల్లలకు, పెద్దలకు ఈజీగా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

దగ్గును త్వరగా తగ్గించే  ఇంటి చిట్కాలు

సిరప్ 1

పావు కప్పు గ్లిజరిన్ తీసుకుని ఒక కప్పులో వేసుకోవాలి. అందులో పావు కప్పు తేనె కలపాలి. అలాగే పావు కప్పు నిమ్మరసం కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. అంతే ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ ఈ దగ్గు మందును రోజంతా తరచుగా తీసుకుంటూ ఉంటే.. దగ్గు ఈజీగా తగ్గిపోతుంది.

సిరప్ 2

ముందుగా అల్లం పొట్టు తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకుని కట్ చేయకుండా, రసం తీయకుండా.. అలాగే తురిమేయాలి. ఒక కప్ నీటిని సాస్ ప్యాన్ లో పోయాలి. నిమ్మ ఆ నీటిలో అల్లం ముక్కలు కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మకాయ తురుము కలపాలి. ఇదంతా బాగా ఉడుకుతున్నప్పుడు.. 5 నిమిషాలు మంట తగ్గించి బాగా మరగనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. తేనె ఒక కప్పు తేనె తీసుకుని సాస్ ప్యాన్ లో వేసి.. సన్నని మంటపై కొద్దిగా వేడి చేయాలి. కానీ.. ఉడకనివ్వరాదు. అందులోకి ముందు కాచి వడగట్టిన మిశ్రమం కలపాలి. ఇప్పుడు రెండు నిమ్మకాయల రసం అందులో కలపాలి. హోంమేడ్ సిరప్ సన్నని మంటపై ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. అయితే గెరిటతో.. కలుపుతూనే ఉండాలి. కాస్త డార్క్ కలర్ లోకి మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో తీసిపెట్టాలి.

 

మోతాదు

5 ఏళ్లలోపు పిల్లలకైతే అర టీస్పూన్ 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు 1 నుంచి 2 టీస్పూన్లు 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. 12 ఏళ్లు పైబడిన వాళ్లు 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు 4 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండే.. దగ్గు తగ్గిపోతుంది


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here