
bhagavad gita slokas 2
శ్రీమద్భగవద్గీత
అథ ప్రథమోపాధ్యాయః – అర్జునవిషాదయోగః
భగవద్గీత సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణభగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది. అపరితమైనది. మనం వర్ణించలేనిది. దీని గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి మహత్తరగ్రంథం నుండి మనం ప్రతీరోజు ఒక శ్లోకం నేర్చుకుందాం.
1 వ అధ్యాయం. 2వ శ్లోకం.
శ్రీమద్భాగవద్గీతా , ప్రదమోధ్యాయః, అర్జున విషాద యోగహ
సంజయ ఉవాచ:
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥2॥
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనః తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ తదా = ఆ సమయమున, రాజా = రాజైన, దుర్యోధనః = దుర్యోధనుడు, వ్యూఢం = వూహ్యరచనతో రణమునకు మోహరించిఉన్న, పాండవానీకం = పాండవ సైన్యాన్ని, దృష్ట్వా = చూచి, తు = మరియు, ఆచార్యమ్ = ద్రోణాచార్యుల వారిని, ఉపసంగమ్య = సమీపించి, వచనం = వా క్యాన్ని, అబ్రవీత్ = అన్నాడు.
ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లు పల్కెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు మోహరించి ఉన్నపాండవ సైన్యాన్ని చూచి, ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికెను.