పరమ శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలు మటుమాయం అవుతాయి శివారాధన వలన వచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పనలవి కానిది
మానసిక శారీరకఆరోగ్యం కోసం : ఒక చిన్న మట్టి శివలింగాన్ని లేక ఏదైనా చిన్న శివలింగాన్ని తీసుకొని దానికి కొంచం మొక్కలు పెంచే మట్టి ని మొక్క ల కుండి నుచి తీసుకోని ఆ మట్టిని కొంచం శివలింగానికి రాస్తే , ఆ శివలింగం మట్టి శివలింగం అవుతుంది. తర్వాత ఆ శివలింగానికి 18 సార్లు” ఓం నమశివాయ” అనే నామం తో జపించాలి కొంచం నీటిని ఒక స్టీల్ లేదా ప్లాస్టిక్ స్పూన్ లేదా రాగి స్పూన్ తో అబిషేకం 48 రోజులు ఉదయం సమయం లో స్నానం చేసిన తర్వాత అబి షేకం చేస్తే , అనారోగ్యం తగ్గి , ఆరోగ్యం పెరుగుతుంది . మానసిక శారిరిక ఆరోగ్యం పెరుగుతుంది .
ఆ తరువాత అబిషేకం చేసిన నీళ్ళను ఒక చుక్క నీటిని తీర్థం గ తీసుకొని మిగిలినవి ఏవైనా మొక్కల కుండి లో పోయాలి . ఇలా 48 రోజులు చేయాలి .. మధ్య లో ఏవైనా ఇబ్బందులు వస్తే ఆ రోజులు ఆపి తర్వాత మళ్ళీకంటిన్యూ చేయవచ్చు ..