
వంట ఇంటిలో వున్న ఔషధాలు మరెక్కడా లభించవు
మనం ప్రతి చిన్న దానికి అల్లోపతి మందులు వాడి అనేక అనర్ధాలు కొని తెచ్చుకుంటున్నాం
వంటింట్లో వున్న కొన్ని ఔషధాలు
1యవ్వన శక్తి కోసం
మూడు ఎండు ఖార్జురాలు తీసుకొని గింజలు తీసివేసి పై పెచ్చులను చిన్న చిన్న ముక్కలుగా నల గ గొట్టి అర గ్లాసు పాలల్లో వేసి పొయ్యి మీద పెట్టి మూడు పొంగులు వచ్చేవరకు మరగించి దించి పాలు గోరువెచ్చగా అయిన తరువాత పాలపై వున్న ఖర్జురపు ముక్కలు తిని పాలు రాత్రి ఆహారం తర్వాత 40 రోజులు సేవించాలి మంచి యవ్వన శక్తి మీ సొంతం అవుతుంది
2 కడుపు నొప్పికి ఉపాయం
ఒక చెంచా నేతి ని గరిట లో వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి వేడెక్కగానే గరిట లో ఒక ఎండుమిరపకాయ నేతి లో వేసి నల్లగా మకుర్యాంబడగానే గరిట ను దించి నేతి ని బట్ట లో వడపోసుకొని కూరన్నం లో ఆ నేతి ని కలుపోకొని తినాలి ఇలా తిన్న వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది
3 మూత్ర పిండాల్లో రాళ్ళు కరుగుటకు మార్గం
1 ఉలవలు 10 గ్రాములు 2 సై0 ధవ లవణం 3 గ్రాములు మెత్తగా నల గ గొట్టి ఒక పాత్రలో అర లీటరు నీరు తీసుకొని ఈ చూర్ణాన్ని అందులో వేసి పావు లీటరు అయ్యేవరకు మరగించి దించాలి వడబోసి ఈ కషాయాన్ని 3 భాగాలు చేసి మూడు పూటల ఆహారానికి గంట ముందు సేవించాలి ఇలా 3 వారాలు చెస్తే మూత్ర పిండాలలోని రాళ్ళు మూత్రం ద్వారా బయటకు వెళ్లి పోతాయి