వందే మహాభారతం – మన చదువు – సంస్కృతి-2 | Mahabharatam – Samskruthi – Education in Telugu 2

0
2936

ప్రాచీన వేద సాహిత్యంలో అణు ప్రస్తావన, పంచభూతాల ప్రాముఖ్యత మనకు స్పష్టంగా కనిపిస్తాయి. పరమాణువు గురించి వేద సాహిత్యం లో దర్శనమిస్తుంది.

బుద్దుని సమకాలీకుడైన పకుధ కాత్యాయనుడు అణు సిద్దాంతాన్ని సమగ్రంగా వివరించాడు.
ఆర్యభట్టు  గ్రహాలూ, చంద్రుడు, స్వయం ప్రకాశకులు కావని, సూర్యుని కాంతి పరివర్తన వాళ్ళ ప్రకాశిస్తాయి అని స్పష్టంగా “ఆర్యభాట్టియం” లో వివరించారు.

ఆ కలంలోనే కాంతి అణు పదార్ధమని, శక్తికారకమని అణువుల సముదాయము అని ఎన్నో ప్రతిపాదనలు ఉన్నవి.

Vyasaప్రాచీన భారతీయ సైనికులు ఇనుప ములికి కలిగిన బాణాలను వాడేవారు. రసరత్నాకరంలో ఇనుప, వెండి, బంగారం, రాగి, తగరం వంటి లోహాల ఉపయోగాన్ని తెలియజేస్తుంది.

శాతవాహన కలం నాటి ఇనుప స్తంభం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నది.
ఆ కలంలో పువ్వులనుండి తీయబడిన  ప్రకృతి సహజమైన పరిమళ ద్రవ్యాలను వాడేవారు. వేల సంవత్సరాల పూర్వమే భావన నిర్మాణ శాస్త్రం వికాసం చెందినది.

హరప్పా, మొహెంజదారో త్రవ్వకాలలో నిర్మాణ కౌశలమ్, మురుగునీటి పారుదల వ్యవస్థ, వ్యవసాయాభివృద్ధిని మనకు తెలియజేస్తుంది. నౌకనిర్మాణ శాస్త్రం మన ప్రాచీన భారతీయులకు సుపరిచితమే.

చాణక్యుని అర్ధ శాస్త్రం, రాజనీతి శాస్త్ర వికాసానికి పరాకాష్ట. ప్రాచిన భారతంలో న్యాయ శాస్త్రం ఎంతో అభివ్రుధి చెందినది.

భారతీయ జ్ఞాన సంపదకు మూలం తర్కశాస్త్రమే.
ఇన్ని శాస్త్రాలతో ఆద్యంతాలు వివరించిన మన భారతీయులే ఆద్యులు అని గర్వంగా చెప్పుకోక తప్పదు.

అలంటి గొప్ప ఘనత కలిగిన మనము మన కళ్ళముందు పుట్టిన పిల్ల మతాల సంస్కృతి ని అభివ్రుధి అని పుస్తకాల్లో ముద్రించి  సంవత్సరాలుగా మన పిల్లల మస్తాకాలలో నింపి మానను విదేశీ సంస్కృతికి బానిసలుగా చేసినారు.

మన సంస్కృతిని చాటి చెప్పే వేదాలను,  పురాణాలను, శాస్త్రాలను వక్రీకరించి మన చేత తప్పటడుగులు వేయించిన వారందరూ విదేశీయ సంస్కృతి కి విధేయులైన వెన్నుపోటుదారులే.

తల్లి, తండ్రి, గురువు, పంచభూతాలు, ప్రకృతిని ఆరాధించే మన సంస్కారం మననుండే ఇతరులకు వ్యాప్తించింది అని గర్వంగా చెప్పుకోవచ్చు.

ఇటువంటి సంస్కృతి సభ్యతలకు మూలమైన మన భారతావని గురించి, భారతీయ గొప్పతనాన్ని మనము తెలుసుకొని ఇతరులకు చాటి చెప్పే సమయం ఆసన్నమైనది.

ఆధునికమంటే విదేశీయులనుండి అరువు తెచ్చుకునే సంస్కృతి కాకూడదు. మన ప్రాచీన భారత వైజ్ఞ్యనికమును ఆధునీకరించి ప్రపంచానికే మనము తలమానికం కావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here