
2. కాళికాదేవి ఉగ్రరూపానికి అర్థం
కాళికాదేవి నల్లని రూపం తమోగుణానికి ప్రతీక. ఒకచేతిలో ఆమె ఖండించిన అసురుని తల,ఖడ్గం, వరద అభయ హస్తాలతో ఉంటుంది. అమ్మ శ్మశానం లో నర్తిస్తుంది. కాలం అంటే వినాశం అనే అర్థం కూడా ఉంది. ఆ వినాశం అనివార్యమైనది. సృష్టించబడిన ప్రతి వస్తువూ నశించక తప్పదు. సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాళిక. ఆమె మహాకాలుని స్త్రీ రూపం. ఆమె మెడలోని పుర్రెలదండ దుష్టులను భయపెడుతుంది. ఆ దండలోని పుర్రెలు 22 బీజాక్షరాలకి ప్రతీకలని అంటారు.
అమ్మ ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహా శివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలికింద పడుకుని ఉంటాడు. స్వామి చర్యను చూసిన కాళిక అచ్చెరువుతో నాలుక తెరచి ఉంటుంది.
Promoted Content
I want kaala ratri ashtotaram in telugu