
అన్నం తిన్న తరువాత మనం చేయకూడనటువంటి అయిదు పనుల గురించి మనం తెలుసుకున్నామంటే అన్నలక్ష్మీ అంటే అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. అన్నపూర్ణా అమ్మ వారి యొక్క అనుగ్రహం పొందడం అంటే మనం ఎన్ని కష్టాల్లో, ఎన్ని బాధల్లో,ఎన్ని దరిద్రాల్లో ఉన్నాకూడా అన్నానికి లోటు ఉండదు,తిండికి లోటు ఉండదు. కాబట్టి ఆ అన్నపూర్ణా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి,చేయకుడనటువంటి పనులు ఏమిటి అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అన్నం తిన్న తరువాత చేయకూడని అయిదు పనులు ఏమిటంటే
- తిన్నటువంటి ప్లేటులో చేతులు కడగటం.ఇలా కడగటం వలన దరిద్రాన్ని కలిగిస్తుంది.కాబట్టి భోజనం చేసిన తరువాత తిన్నటువంటి ప్లేటులో చేయి కడగకూడదు.
- అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో దగ్గు వస్తే అక్కడే కూర్చుని ఉమ్మి వేయకూడదు.ఇది పరమ దరిద్రాన్ని సూచిస్తుంది.
- భోజనం పూర్తి అయిన తరువాత చాలా మంది కూడా ఒక అగ్గిపుల్లనో, లేక టూత్ పిక్ నో తీసుకుని నోటిలోని పళ్ళ మధ్యలో గుచ్ఛకూడదు.ఒకవేళ అంతగా ఇబ్బందికరంగా ఉంటే నీటి పుక్కిలించవచ్చు.అంతేకాని పళ్ళను గుచ్చడం దరిద్రాన్ని కలిగిస్తుంది.
- భోజనం చేసిన తరువాత చాలామంది కూడా వొళ్ళంతా బరువుగా ఉందని తిన్న ప్లేట్ ప్రక్కనే నడుం వాల్చి పడుకుంటూ ఉంటారు.అలా చేయటం కూడా పరమ దరిద్ర హేతువు.
- భోజనం చేసి చేతులు కడిగిన తరువాత చేతుల్ని తుడుచుకోకుండా విధిలిస్తూ ఉంటారు.ఆ నీరు అంతా చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద పదార్ధాల మీద పడుతూ ఉంటాయి.కాబట్టి చేయి కడిగిన తరువాత ఏదైనా బట్టతో తుడుచుకోవాలి, కాని విదిలించకూడదు.అలా చేయటం చాలా దరిద్రం.
కాబట్టి ఈ అయిదు పనులను చేయకుండా ఉంటే అన్నపూర్ణాఅమ్మ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది.తిండికి లోటు ఉండదు.
“సర్వేజనా సుఖినోభవంతు”
సన్నబడాలంటే అన్నం మానేయాలా? | Should I avoid eating rice to lose weight in Telugu