99 క్లబ్బు – తప్పక చదవవలసిన కథ

0
1620

అనగనగా ఒక రాజు. రాజుగారు అనేక భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ జనరంజకంగా పాలిస్తున్నాడు. అయినా ఎదో ఒక వెలితి ఆయనలో. సరిగా నిద్రపట్టేది కాదు. ఆయనలో తృప్తీ సంతోషమూ ఎప్పుడూ ఉండేవి కావు.

ఒక రోజు ఆయన అడుతు పాడుతు పనిచేస్తున్న ఒక నౌకరును చూశాడు. వాడు ఎంతో ఆనందంగా పనిచేస్తూ పాడుకుంటూ పనిని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

నువ్వు పని చేస్తూ కూడా ఆనందంగా ఎలా పాడుకోగాలుగుతున్నావు ? సంతోషంగా ఎలా ఉన్నావు ?
రాజా ! నేను కూలీ వాడిని. నాకు కావలసింది పైన ఒక నీడ. కడుపులోకి వేడి వేడిగా ఇంత బువ్వ. మీ దయవలన అవి రెండూ మా కుటుంబానికి బాగా అందుతున్నాయి. ఇక సంతోషమూ, తృప్తీ కాక ఏమి కావాలి ?” అన్నాడు ఆ కూలీ వాడు.

మంత్రిగారిని పిలిచాడు. వాడికి అంత సంతోషమూ, నాకు ఇంత అసంతృప్తీ ఎందుకు అని అడిగాడు.
మంత్రి వెంటనే “ అయ్యా ! వాడు 99 క్లబ్బులో లేడు. అందుకే అంత సంతోషంగా ఉన్నాడు. “

99 క్లబ్బా ? అంటే ఏమిటయ్యా ?

అదేమిటో తెలుసుకోవాలంటే మీరు 99 బంగారు నాణేలు తీసుకుని ఒక సంచీలో వేసి వాడి గుమ్మం ముందు పడెయ్యండి. తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి. మీకే తెలుస్తుంది.

మర్నాడు చీకటి ఉండగానే రాజుగారు స్వయంగా మారువేషంలో కూలీ వాడి గుమ్మంలో సంచీ వదిలి వాడు లేచి ఆ సంచీ తీసుకుని లోపలి వెళ్ళాక చాటు నుండి వాడు ఏమి చేస్తున్నాడో గమనించడం మొదలు పెట్టారు.
వాడు ఆ సంచీని విప్పి బంగారు నాణేలు చూసి ఆశ్చర్యపోయాడు. తీసి లెక్క పెట్టాడు 99 ఉన్నాయి. వందో నాణెం కోసం బయటకు వచ్చి వెతికాడు, దొరకలేదు. మళ్ళీ లోపలి వెళ్ళాడు, లెక్క పెట్టాడు భార్యను పిలిచాడు, లేక్కపెట్టమన్నాడు. ఆమె లెక్కపెట్టినా వందవ నాణెం కనబడలేదు.

భార్యతో అన్నాడు వందో నాణెం కోసం కష్టపడి ఇద్దరం పని చెయ్యాలి అని చెప్పాడు.
అతడి జీవితం మారిపోయింది. కష్టపడి అదనపు పని చెయ్యడం అదనపు సంపాదన కోసం అనేక పనులు చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం, భార్యపై కోపపడడం మొదలయ్యాయి, వాడి ముఖం లో చిరునవ్వు కనబడడం మానేసింది. పాటలు పాడటం ఆగిపోయింది. చిరాకులు మొదలయ్యాయి. ఇంట్లో మనుషుల సహకారం లేదని పిల్లలనూ, భార్యనూ తిట్టడం మొదలయ్యింది.

వాడిలో వచ్చిన మార్పును మంత్రితో చెప్పాడు  రాజు “ అవును రాజా ! అతడు ఇపుడు 99 క్లబ్బులో పూర్తికాలపు సభ్యుడు అయ్యాడు.

99 క్లబ్బు అంటే సంతోషంగా గడపడానికి అవకాశం ఉన్నా అందనిది ఏదో అందుకోవాలని అర్రులు చాచటం.
తనకు ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా గడిపే అవకాశం ఈ క్లబ్బులోని సభ్యులకు ఉండదు. ఇంకా ఏదో సాదించి అప్పుడు ఆనందిస్తాను అనుకుంటూ ఎప్పటికీ తృప్తిని పొందలేరు కొందరు మానవులు. వారి జీవితం అంతా సంపాదించాలనే అనుకుంటారు తప్ప తృప్తికి మించిన సంపాదన లేదని అనుకోరు. మన ఉద్యోగులూ, ప్రతినిధులూ అందరూ ఇదే యావలో ఉంటారు ప్రభూ ! “

ఇందులో చేరటానికి సభ్యత్వం అక్కరలేదు గాని, జీవితాన్నే దానికి అంకితం చేసేస్తాము ప్రభూ ! ఆదిశంకరుల భజగోవిందం సారం ఇదే ప్రభూ !

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here