
Ayurveda Benfits Of Cumin In Telugu
తాలింపు దినుసుల్లో ముఖ్యమైంది జీలకర్ర. దీన్ని రోజూ వాడటం వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.
* లోబీపీ ఉన్నవారు… జీలకర్రని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికీ ఇది మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు తీసుకుంటే మంచిది. ఎర్రరక్త కణాల వృద్ధీ బాగుంటుంది.
* పొద్దునే వికారం, తలతిప్పడం వంటి వాటితో కొందరు బాధపడుతుంటారు. అలాంటి వారు ఉదయం పూట జీలకర్రను నెయ్యిలో వేయించుకుని అన్నంలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు అధికం. అవి శరీరంలో రోగనిరోధకశక్తి పెంచుతాయి. వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ కాలంలో చిన్నారులకు తినిపించే ఆహారంలో జీలకర్ర ఉండేలా చూసుకోవడం మంచిది. రకరకాల ఇన్‌ఫెక్షన్లూ తగ్గుముఖం పడతాయి. జీలకర్రలో యాంటీసెప్టిక్ కారకాలు అధికం. వీటితో జలుబూ, ఫ్లూ జ్వరాలూ అదుపులో ఉంటాయి. కప్పు నీళ్లలో జీలకర్ర వేసి మరిగించి, కాసేపయ్యాక వడకట్టి అందులో తేనె, తులసి ఆకులు వేసి తాగాలి. దీనితో లభించే విటమిన్ సి అన్ని సమస్యల్నీ దూరం చేస్తుంది.
* మహిళలు నెలసరి సమయంలో జీలకర్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. రక్తస్రావం సక్రమంగా అవుతుంది. రకరకాల నొప్పులూ అదుపులో ఉంటాయి. జీవక్రియల రేటు కూడా వృద్ధి చెందుతుంది.