నేడు అనేక మంది సంతాన లేమితో బాధపడుతున్నారు. సంతాన లేమికి నివాసగృహ వాస్తుదోషం కూడా కారణం కావొచ్చు. జ్యోతిష్యశాస్త్ర రిత్యా గురుడు పుత్రకారకుడు. మరియు వాస్తు రిత్యా గృహ ఈశాన్యానికి గురుడు అధిపతి. కావున నివాసగృహ ఆవరణ ఈశాన్యం మిగిలిన దిక్కులకంటే ఎత్తైనా,ఈశాన్య స్థలం తగ్గిననూ ఈశాన్యం ఖాళీ లేకపోయిననూ ఆ గృహములో నివసించువారికి సంతాన విషయంలో,ఆరోగ్యరిత్యా సమస్యలు ఎదురౌతాయి. అందువల్ల గురు గ్రహ సంబంధమైన జపహోమాలు చేయడం వల్ల వాస్తుదోష నివారణ జరుగుతుంది. వాస్తు పండితుని సంప్రదించి పరిహారం తెలుసుకోవడం మంచిది.