మనం తినే ఆహరం మీద జ్యోతిష్య శాస్త్రరిత్యా ఏమైనా ప్రభావం ఉందా ?

0
8632

according-to-the-astral-science-do-we-have-any-effect-on-the-food-we-consume

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి .?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి.

మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు.

సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి.

మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.

బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తినచ్చు

గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తినండి.

శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరం.

శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. మన ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి.

మనం తినే ఆహారం భూమినుండి నెగెటివ్ మరియు పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం.

జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే….మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నించాలి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి.

వైద్య సలహాలకు జ్యోతిషం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు, కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది. జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here