
Naraka Chaturdashi
తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తలంటుకోవాలి. అలా తలంటుకునేటప్పుడు
“ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని చెప్పుకోవాలి.
స్నానాంతరం నల్లనువ్వులతో
“యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి. నరకాసురుడు మరణించిన సమయం అది.
ఆపై
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ!
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!!
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే!
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!! అని చెప్పుకోవాలి.
ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. ఆ రోజు మినపాకులతోకూర వండుకు తినాలి. వీలుకాకపోతే మినపగారెలైనా సరే. నరకచతుర్దశినే ప్రేతచతుర్దశి అని కూడా అంటారు.
వెలుగు జ్ఞానానికి గుర్తు. సంతోషానికి ప్రతీక. చీకటిని దూరం చేసే దీపం మనిషి వివేకానికి సంకేతం. భారతీయ దివ్య ఋషులు, దార్శనిక శక్తి కల్గిన మహర్షులు మేధోమధనంలో మానవాళి అభివృద్ధి కోసం శాస్త్రాలు రచించి, నియమాలు వివరించిండ్రు. అనేక వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఆచరిస్తూ, అనుసరిస్తూ, అభిమానిస్త్తూ వచ్చిందే సంప్రదాయం.
దీపావళి పోస్ట్స్
దీపావళి – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు
Comment:Nice.for giving information …thanku so much