వాస్తు ప్రకారం ఇంటి కోసం ఎటువంటి స్థలం కొనాలి?

0
8751

Archbishop's_House,_Changanassery,_Kerala

Vasthu For Home

సూక్ష్మంగా , విపులంగా గల ఈ వాస్తు సలహాలను చదివి అవగాహన చేసుకోగలరు అని భావిస్తూ స్థలం కొనే వారి కోసం సలహాలు

  1. మొట్ట మొదటి సూచనగా మీరు కొనబోయే గృహమునకు ఈశాన్యం త్రెంపు లేకుండా చూసుకోవాలి
  2. గృహమునకు ఈశాన్య భాగం లో మెట్లు, దిబ్బలు, భారి భవంతులు, సెల్ ఫోన్ టవర్లు లాంటివి లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం లో తొలగించుకోడానికి వీలైన మెట్లు, దిబ్బలు లాంటివి తొలగించుకొని మాత్రమె గృహమును కొనడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ వీలు లేకపోతే గృహమును కొన్న తక్షణమే వాటిని తొలగించుకోవాలి. తొలగించుకోడానికి వీలు లేని నిర్మాణములు ఉన్నచో ఆ గృహమును మీరు కొనకపోవడమే మంచిది.
  3. మీరు కొనబోయే గృహమునకు తూర్పు భాగం త్రెంపు కలిగి ఉండరాదు. అలాగే తూర్పు భాగం లో ఎత్తులు గాని, భారి భవంతులు గాని ఇతరత్రా ఇబ్బందులు కలిగించే అవాస్తు నిర్మాణాలు ఉన్నచో ఆ గృహమును కొనవద్దు.
  4. మీరు కొనబోయే గృహమునకు ఆగ్నేయ భాగం త్రెంపు కలిగి ఉన్నచో ఏ ప్రమాదం లేదని గమనించాలి. కొన్నిసార్లు ఆగ్నేయ భాగం త్రెంపు గృహాలు అందు వుండు యజమానులను మంచి అభివృద్ధి కి తిసుకువెల్లడం జరుగుతుంది.
  5. కొనబోయే గృహమునకు దక్షిణ భాగం వుచ్చంగా, బాగా ఎత్తుగా, మిర్రు కలిగివున్నపుడు చాల మంచిది.
  6. దక్షిణ భాగం పల్లం కలిగి, గుంతలు, కొలనులు, పెద్ద కాలువలు ఉన్నచో అటువంటి గృహములను కొనరాదు.
  7. కొనబోయే గృహమునకు నైరుతి పెరిగి ఉన్నచో అటువంటి గృహములను వదులుకోవడం మంచిది. పెరిగిన నైరుతి భాగమును తొలగించుకోడానికి వీలై అనుకులమైనచో ఆ గృహమును కొనవచ్చును. హెచ్చరిక గా వుండాలి.
  8. నైరుతి భాగం లో ఎటువంటి పరిస్థితుల లోను గుంతలు, కొలనులు, పెద్ద కాలువలు, బావులు ఇతరత్రా దోషపురితమైనవి వున్నపుడు అటువంటి గృహములను కొనరాదు. ఈ విషయం లో జాగ్రత్త అవసరము.
  9. నైరుతి భాగం లో కొండలు, గుట్టలు, భారి భవంతులు, అపార్టుమెంట్లు, సెల్ ఫోను టవర్లు ఇతరత్రా ఉన్నచో అటువంటి గృహములను నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. చాలా మంచిది. ఈ అవకాసం వదులుకోవద్దు.
  10. కొనబోయే గృహమునకు పశ్చిమ భాగం పల్లం గా వుంటే ఆ గృహమును కొనరాదు. కిరాయి కి ఉండటము మంచిది కాదు.
  11. పశ్చిమ భాగం మిర్రు కలిగి వున్న గృహములను కొనవచ్చు. ఆరోగ్యము, ఐశ్వర్యం, పెద్దరికము లభించును.
  12. కొనబోయే గృహమునకు వాయువ్య భాగం లో పల్లం గాని, గుంతలు, బావులు గాని లేకుండా చూసుకోవాలి.
  13. కొనబోయే గృహమునకు ఉత్తర భాగం లో బావులు, గుంతలు, పెద్ద కాలువలు ఇతరత్రా ఉన్నచో గృహమును కొనవచ్చు.
  14. కొనబోయే గృహమునకు ఉత్తర భాగం లో మెట్లు గాని, భారి భవంతులు గాని, గుట్టలు గాని ఇతరత్రా ఉన్నచో అటువంటి గృహములను కొనకపోవడం చాల మంచిది. లేనిచో అష్ట దరిద్రము, నిత్యము తలపోట్లే.
  15. వీధి పోట్లు విషయం లో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం గా ఈశాన్య వీధిపోటు వున్న గృహములను ఎటువంటి పరిస్థితులలోను వదులుకోరదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here