
1. పెద్దవారి పాదాలను తాకి నమస్కరించడంలోని పవిత్రత
శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు కనిపించనప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవారు. భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. అయితే, కొందరు పాదాలను అపరిశుభ్రంగా భావిస్తారు. అయితే, పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి. పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి. అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.
Promoted Content