ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu

0
2344

ayurveda

  • ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu

ayurveda tips for allergy

  • ఎలర్జీ చాలా మందికి చిరపరిచయమైన పదం. ప్రతి పదిమందిలోనూ కనీసం ఇద్దరికి ఏదో ఒక రూపంలో ఎలర్జీలు బాధిస్తాయని పరిశీలనలు చెబుతున్నాయి.
  • దీర్ఘకాలంపాటు బాధించే ఎలర్జీలకు శాశ్వత పరిష్కారం కోసం బాధితులు అన్వేషిస్తుంటారు. అటువంటి వారికి ఆయుర్వేదం ఎలా రక్షిస్తుందో చూడండి.

వ్యాధి రక్షణ శక్తి తగ్గటం, కాలుష్యాలు పెరగటం అనే రెండు ముఖ్యమైన అంశాల కారణంగా ఎలర్జీలు బలపడి మొండిగా తయారవుతాయి.

బలవంతంగా అణిచిన కొద్దీ ఎలర్జీలు ఏదో ఒక రూపంలో బహిర్గతమవుతూనే ఉంటాయి. కారణాన్ని కనిపెట్టి మూలానికి వెళ్లి చికిత్స చేయడమొక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. ఆయుర్వేదం ఈ దిశగా పనిచే స్తుంది.

వ్యాధి వ్యవస్థ ప్రతిస్పందన అసాధారణంగా పెరగడాన్ని ఎలర్జీగా చెప్పవచ్చు. వాతావరణంలోని ఎలర్జీ కారకమైన ‘ఎలర్జన్‘కి వ్యతిరేకంగా శరీరం మితిమీరి ప్రవర్తించినప్పుడు ఎలర్జీ పుడుతుంది.

మామూలు సందర్భాల్లో మామూలు వ్యక్తుల్లో ఏ రకమైన చర్యా కలిగించని కొన్ని పదార్ధాలను కొంతమంది శరీరం హానికరమైనవిగా భ్రమపుడుతుంది.

ప్రతి చర్యగా అనేక లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ లక్షణ సముదాయమే ఎలర్జీ. ఆయుర్వేదంలో ఎలర్జీ లక్షణాలకు సంబంధించిన వివరణ పీనసం,ఉదర్ధం,కోఠరం, కండూ తదితర పదాలతో కనిపిస్తుంది.

2. లక్షణాలు:

ఎలర్జీ లక్షణాలను మూడు వర్గాలుగా విభజించవచ్చు.

  • మొదటి వర్గానికి చెందిన లక్షణాలు శరీరంలో ఒక భాగానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమవుతాయి. ఉదాహరణకు దద్దురు, దురద, కళ్లు నీరు కారటం, వాపు, ముక్కు పూడుకుపోవటం వంటివి ఉన్నప్ప టికీ అవి ఇతర ప్రాంతాలకు వ్యాపించవు.
  • రెండవ వర్గానికి చెందిన లక్షణాలు శరీరంలో ఉత్పత్తి స్థానంలోనే కాకుండా ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. దురదలు, ఆయాసం వంటివి ఈ కోవకు చెందుతాయి.
  • మూడవ వర్గానికి చెందిన లక్షణాలు ప్రమాదకరమైనవి. ఎనాఫిలాక్సిస్ అనే షాక్ ను పోలిన స్థితి రూపంలో బాహిర్గతమవుతాయి. ఎనాఫిలాక్సిస్ స్థితిలో ఎలర్జీ లక్షణాలు హఠాత్తుగా మొదలవుతాయి. శరీరం మొత్తం దీనికి ప్రభావితమవుతుంది. కంటి దురద, ముఖం దురద వంటి లక్షణాలతో మొదలైన ఎలర్జిక్ రియాక్షన్ క్షణాల్లోనే శరీరం మొత్తం వ్యాపిస్తుంది. సమయం గడిచేకొద్దీ తీవ్రస్థాయి లక్షణాలను కలిగిస్తుంది. ఉదాహరణకు కడుపునొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపించవచ్చు. గొంతు లోపల వాపు జనించడంవల్ల మింగటం, శ్వాసతీసుకోవటం కష్టతరంగా మారతాయి. రక్తపోటు పడిపోవటంవల్ల అయోమయం, కళ్ళు బైర్లుకమ్మటం వంటివి కూడా కనిపిస్తాయి. ఎలస్టీలు సాధారణంగా అనువంశికంగా ప్రాప్తిస్తాయి. ఎలర్జీ తత్వమనేది పెద్దల పెద్దల నుంచి పిల్లలకు ప్రాప్తిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తల్లిదండ్రుల్లో ఒకరికి ఎలర్జీ ఉంటే, వారి పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఇద్దరికీ ఎలర్జీలు ఉంటే వారి సంతానానికి ఎలర్జీ వచ్చే అవకాశం 75 శాతానికి పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here