అమావాస్య సోమవారముల నోము కథ

0
678

ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కుమారులున్నారు. ఒకే ఒక కూతురు. ఆ యింటిలో కోడళ్ళూ, కూతురూ రోజూ వచ్చిన బ్రాహ్మణునికి బియ్యంవేసేవారు. ఆతడు కోడండ్రందరూ నీవు సౌభాగ్యము పొందుము. అనీ కూతురును మాత్రం నీకు గంగా స్నాన ఫలము కలుగుగాక, అని దీవించేవాడు. ఒకనాడు తల్లిదండ్రులకు యీ విషయం చెప్పగా వారా బ్రాహ్మణుని నిలదీసి అడిగారు. ఆతడప్పుడు అయ్యా! నీ కూతురికి వివాహం రోజునే భర్త గతిస్తాడు. అనగా! వారాపాపము పోవుమార్గం చెప్పమన్నారు. ఏడు సముద్రాల కావల చాకలి పోలి ఉంది. ఆమె యీదోషం పోగొట్టగలదు అన్నాడు. ఈ విషయం తన ఏడుగురు కుమారులకు చెప్పగా ఆఖరివాడే దానికి సిద్ధమై “నా చెల్లెలను ఆమె దగ్గరకు తప్పక తీసికెళ్ళ గలనని చెప్పెను. చెల్లెలను తీసికొని అతడు ప్రయాణించాడు. సముద్రం ఒడ్డుకు వచ్చి అచ్చట ఒక చెట్టు నీడను యిద్దరు ఉండగా ఆ చెట్టు పండు పడింది. దానిని సగము సగము అన్నాచెల్లెలు తిన్నారు. ఆ చెట్టుపైనున్న ఒకపక్షి వచ్చి వారిరువురునూ తన రెక్కలపై కూర్చుండబెట్టుకొని ఏడు సముద్రాలావల నున్న చాకలిపోలివాకిట నిలిపి పోయింది.

ఆ రోజు నుంచి చాకలిపోలి వాకిలి తుడిచి ముగ్గు పెట్టి ఒక బసలో భోజనం చేయసాగారు. ఒకరోజు చాకలిపోలివారిద్దరినీ చూచినారెవరు? ప్రతిరోజూ యిలా నాకు చాకిరీ చేయు చున్నారు. పాపం అనగా! అప్పుడు వారు అదేపాపం దానిని నీవే పోగొట్టాలని బ్రతిమాలారు. ఆమె తన కోడండ్రను జూచి బిడ్డలారా! మనింటిలో యెవరు చనిపోయినా, నేనూ వచ్చేవరకూ ఉంచండని వారిరువురూ తీసికొని యోగశక్తితో వారియింటికి వచ్చెను. అప్పుడు చాకలిపోలి ఆబిడ్డకు వివాహం చేయించగా సప్తపాదాలు తొక్కుచుండగా వరుడు చనిపోయాడు. అప్పుడు పోలి తాను గావించు అమావాస్య సోమవారాల వ్రత ఫలంధారబోసి చచ్చిన పెండ్లి కొడుకును బ్రతికించెను. అచ్చట నున్న వారందరూ ఆశ్చర్యం, ఆనందం పొందారు. కాని పోలి యింటనున్న యేడుగురు కుమారులు చనిపోయారు.

పెండ్లివారి దగ్గర శెలవుతీసికొని యింటికి చాకలిపోలి వచ్చుచుండగా మధ్యలో అమావాస్య సోమవారం రాగా అచట గల రావిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయ, తన యింటి వద్ద చనిపోయిన ఏడుగురు కుమారులూ బ్రతికారు. యింటికి పోలిరాగా కోడండ్రందరూ యీ వింత గూర్చి అడగ్గా అమావాస్య సోమవార వ్రతం, మహిమను వారికి చెప్పి వారందరి చేతా ఆ మహావ్రతము చేయించింది.

ఈ వ్రత విధానం –

108 అమావాస్య సోమవారాలు చేయాలి. రావి చెట్టెకు 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేస్తూ,

బ్రహ్మరూపా! మధ్యలో విష్ణురూపా! పైని శివరూపా! వృక్షరాజా! నీకు నమస్కారం అని ప్రార్థించాలి. నూటయెనిమిది ఫలములో, పసుపుకొమ్ములో ప్రదక్షిణకు వినియోగించి, అనంతరం వాటిని ఒక పళ్లెమున నుంచి వృక్షము మొదట వేయాలి.

యాధాశక్తిగా బియ్యం మండపంపోసి లక్ష్మీనారాయణల ఫోటో నుంచి దిక్పాలుర నందరనూ ఆవాహనం చేసి వ్రతము 108 అమావాస్య సోమవారాలు చేసి యీ మండపంతో ముత్తయిదువులు ఏడుగురకు జాకెట్టు బట్టలతో దక్షిణ తాంబూలాలివ్వవలెను.

అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు ! | Amavasya Pooja Significance in Telugu !