అంబరీషుడు

0
1040

అంబరీషుడనే రాజు గొప్ప విష్ణుభక్తుడు. ఆ రాజు భక్తికి మెచ్చి, విష్ణువు తన సుదర్శనచక్రం ఆయనకు రక్షణగా ఉండే విధంగా వరం ఇచ్చాడు.

ఒకసారి అంబరీషుడు సంవత్సరం పొడవునా వ్రతం ఆచరించాడు. వ్రతం చివరి మూడు రోజులూ ఉపవాసం చేసి, ఆఖరి రోజున దైవపూజలు జరిపి, భోజనం చేయడానికి ఉపక్రమించాడు. సరిగ్గా ఆ సమయానికి, దుర్వాసముని వచ్చి, “కొంత సేపు ఆగు; స్నానం చేసి వస్తాను,” అని చెప్పి నదికి వెళ్ళాడు.

కాని, ఎంత సేపటికీ దుర్వాసముని నది నుంచి తిరిగి రాలేదు. అక్కడ ఉన్న ఇతర ‘మునులూ, ఋషులూ శుభఘడియలు దాటిపోకముందే ఉపవాసం ముగించవలసిందిగా అంబరీషుణ్ణి కోరారు. ఆ పెద్దల కోరిక ప్రకారం, ఆయన ఉపవాసం విరమించినందుకు సూచనగా కొద్దిగా జలపారణ చేశారు.
అప్పుడే అక్కడికి వచ్చి, దానిని చూసిన దుర్వాసముని కోపా వేశంతో, ” నేను రాకముందే ఉపవాసం విరమించి నన్ను అవమానపరుస్తావా ?” అని, తల నుంచి ఒక జడను లాగి నేలకు కొట్టాడు, ఆ జడ నుంచి ఒక రాక్షసుడు పుట్టి అంబరీషుడి కేసి రాసాగాడు. అంబరీషుడు సుదర్శనచక్రాన్ని స్మరించాడు. మరుక్షణమే విష్ణుచక్రం వచ్చి, ఆ రాక్షసుడి తలను ఖండించి, దుర్వాసుని తరమసాగింది.

ఎదురుచూడని పరిణామానికి హడలిపోయిన దుర్వాసుడు, పరుగు పరుగున దేవేంద్రుడి దగ్గరికి పోయి శరణు వేడాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అతడు అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మనూ, శిపుణ్ణి వేడుకున్నాడు.

వారు కూడా అతన్ని సుదర్శనచక్రం నుంచి కాపాడలేమన్నారు. ఆఖరికి దుర్వా సుడు వైకుంఠానికి పోయి, కాపాడమని విష్ణువు పాదాలపై పడ్డాడు. విష్ణువు చిన్నగా నవ్వి, “సుదర్శన చక్రాన్ని ఉపయోగించుకునే వరాన్ని అంబరీషుడి కిచ్చాను. దానిని నేను కూడా ఆపలేను. కావాలంటే నువ్వే వెళ్ళి అంబరీషుడి శరణు వేడుకో.” అని సలహా ఇచ్చాడు.

చేసేది లేక , దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి, క్షమాపణలు చెప్పుకున్నాడు. అంబరీషుడు విష్ణువును స్మరించి, సుదర్శనచక్రాన్ని ఉపసంహరించాడు.

పవిత్ర లింగాలు… పంచారామాలు..! ఎక్కడ వున్నాయో తెలుసా ? | Where are Pancharama Temple Located in Telugu?