
ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు ఉసిరికాయలు.
ఉసిరి చేతిలో ఉంటే చాలు సర్వరోగాలూ పోతాయని పెద్దలు అంటారు. ఉసిరికాయను దైవ వృక్షం అంటారు.
ఉసిరి పండు : ఆయుర్వేదము నందు ఉసిరిక పండునకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చిరి. ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను,పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. ఉసిరిక కాయలను ప్రతిరోజూ సేవించుట వలన శరీరములో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులను దరి చేరనివ్వదు.
అమృతముతో సమానమైన గుణములు కలిగి ఉండుట వలన దీనిని అమృత ఫలమందురు. నేత్రములకు మంచిది. మధుమేహము, కుష్టం, మూలశంక, స్త్రీలలో కలుగు ప్రదర రోగం (అధిక ఋతుస్రావం), రక్తస్రావ రోగం మొదలగు వ్యాదులలో అత్యుత్తమముగా పని చేయును. ఇందు అధిక మాత్రలో విటమిన్ సి ఉండును.
ఉసిరిక పండ్లతో చేసిన అత్యంత బలకరమైన, ప్రాచుర్యమైన మందు చ్యవనప్రాశావ లేహ్యం. మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును. ఈ రెండు కలిసిన మందు ‘నిశా అమలకి’ టాబ్లెట్ గా మందుల షాపులలో లభ్యమగు చున్నది.
ప్రదర వ్యాధులందు (స్త్రీలలో వచ్చు అధిక ఋతుస్రావం) ఉసిరికాయల చూర్ణమును చక్కెర లేదా తేనెతో లేదా బియ్యం కడిగిన నీటితో ఇచ్చిన తగ్గును.
మూత్రం ఆగిపోయిన యెడల ఉసిరిక చూర్ణమును బెల్లంతో కలిపి ఇచ్చిన మూత్రం మరల సాఫీగా జారీ అగును. ఉసిరిక చూర్ణమును ప్రతిరోజూ సేవిన్చినచో నేత్ర వ్యాధులు తగ్గును.
ఈ విధముగా ఉసిరిక శ్వాస, క్షయ, దగ్గు, ఆమ్ల పిత్తము మొదలగు వ్యాధులయందు కూడా పని చేయును. శుక్ర వృద్ధిని చేయును. జ్ఞాపక శక్తిని పెంపొందిన్చును.
ఉసిరికాయను ఎక్కువ జుట్టుకి ఉపయోగిస్తారు. అలాగే పూజలు చేయడానికి, దీపాలు వెలిగించడానికి వాడతారు. అయితే.. అందరికీ అందుబాటులో ఉండే ఈ ఉసిరికాయతో.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చట. అలాగే కొలెస్ర్టాల్ లెవెల్స్ ను కూడా తగ్గించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడించాయి.
పుల్లగా, వగరుగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉసిరి జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని తాజాగా వెల్లడైంది. అంతేకాదు ఈ ఉసిరి జ్యూస్ శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ర్టాల్ ని తగ్గించడంలో బేషుగ్గా పనిచేస్తుంది. మెడిసిన్స్ కంటే.. ఈ ఉసిరికాయలు చాలా పవర్ ఫుల్ గా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేశాయని స్టడీస్ చెబుతున్నాయి.

ఒక అర స్పూన్ ఉసిరిపొడి గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉదయం మరియు రాత్రి నిద్ర పోయేటప్పుడు తీసుకొంటే మంచిది. లేదంటే రెండు పచ్చి ఉసిరికాయలు దంచి రసం తీసి , దానిలో ఒక స్పూన్ తేనే కలిపి రెండు పూటలా తీసుకోవచ్చు..
.
కొబ్బరి నూనెలో ఉసిరికాయలను వేసి, నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకి ఆద్దటం వలన ఇంటి దగ్గరే నెరిసిన జుట్టుకి శాశ్వత పరిష్కారం పొందుతారు. దీనితో పాటూ, ఉసిరికాయ రసాన్ని తాగటం చాలా మంచిది