
1. ఎన్ని పేర్లో! ఎంతటి అర్ధమో!
తిరుమల దేవునికి ఎన్నో, ఎన్నెన్నో పేర్లున్నాయి. శ్రీనివాసుడు, మంగపతి, శేషాచలపతి, వేంకటపతి, వేంకటేశ్వరుడు, తిరుమలేశుడు, సప్తగిరీశుడు, కలియుగ దేవుడు, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు, అడుగడుగుదండాలవాడు, గోవిందుడు, శ్రీవారు, శ్రీనిలయుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు – ఇలా ఎన్నో పేర్లతో గోవిందుని భక్తులు పిలుస్తుంటారు. గిరిశిఖరాలపై కొలువున్న ఆ శ్రీ వేంకటేశ్వరుని చాలా పేర్లకు మనకు అర్ధాలు తెలియవు. ఆయా పేర్లలోని ఔచిత్యం చాలామందికి బోధపడదు.
తిరుమల శ్రీనివాసుని పేర్లలోని కొన్నింటి ఔచిత్యాన్ని పరిశీలించి, అవగాహన చేసుకుంటే మనందరి కోసమే ఆ శ్రీవారు ఈ బిరుదు లన్నింటినీ తగిలించుకున్నాడేమో అని అని పించకపోదు.
Promoted Content