కుజ దోషం అంటే బయపడుతున్నారా? కుజ దోషం గురించి తెలుసుకోండి | Do you Afraid of Kuja Dosha in Telugu

2
10623

2

Do you Afraid of Kuja Dosha in Telugu/ కుజ దోషం అంటే బయపడుతున్నారా? కుజ దోషం గురించి తెలుసుకోండి

Back

1. కుజదోషం గురించిన కథ

కుజదోష నిర్ధారణ విషయంలో ఒక్కో పండితుడు ఒక్కోరకంగా నిర్ధారిస్తారు.”ఇంత వయసు వచ్చినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా” ? అనే ప్రశ్న వినిపించిన వెంటనే, ”ఆ అమ్మాయికి కుజ దోషం ఉందట”! అనే సమాధానం వినిపిస్తూ వుంటుంది. ఇక ఈ మాట విన్న వాళ్లంతా కుజదోషం అంత భయంకరమైనదా? అని అనుకోవడం సహజం. అయితే కుజదోషం గురించి అంతగా భయపడవలసిన పనిలేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్యకూడా కాదు. జాతకాలు చూసే వాళ్లలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడంవల్ల, కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి వున్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడనే విషయం చాలా మందికి తెలియదు.

భరద్వాజ మహర్షి ఓ సౌందర్యవతిని చూడటం వలన ఆయన మనసు అదుపు తప్పి ‘రేతస్సు’ భూమిపై పడింది. ‘మంగళుడు’అనే పేరుతో ఆ శిశువు భూదేవి ఆలనా పాలనలో పెరిగాడు. అగ్నికి సమానమైన తేజస్సు కలిగినవాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైన కోపం … అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోని పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వలన తాత్కాలికమైన నష్టం జరిగినా … పట్టుదల కారణంగా విజయాలు అందుకున్న వారి సంఖ్య ఎక్కువని చరిత్ర చెబుతోంది.

Promoted Content
Back

2 COMMENTS

  1. Hi

    na name Nithya aithe nenu okarini love chesanu. athaniki khuja dosham undhi ani abbai valla amma vallu khuja dosham oka vanka ga pettukuni ma pelliki oppukovadam ledhu.. okavela ma iddhariki antey athaniki naku pelli aithe ma amma chanipotharu ani chepthunaru. edi correct e na ala avakunda amaina parishkaram untey cheppandi… alagey pelli ayaka godavalu rakunda mukyam vidipokunda undataniki amaina parishkaram undha… dhayachesi cheppandi..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here