
1. మధ్యాహ్న భోజనం మానేయడంవల్ల జరిగే నష్టాలు..?
మధ్యాన్న భోజనాన్ని మానేస్తున్నారా..?
పని ఒత్తిడి వల్లనో, లేక మధ్యాహ్నం భోజనం చేయడం వల్ల తరువాత నిద్ర వొచ్చే ప్రమాదం ఉందనో, లేక మరేదైనా కారణం వల్లనో మధ్యాన్న భోజనం చేయకుండా చాలామంది దాటేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల మీ సమయం ఆదా అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. మధ్యాన్న భోజనం మానేయడం వల్ల శరీరం లోని చక్కెరల శాతం తగ్గి మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది.
దాని వల్ల అరగంటలో పూర్తి చేయదగిన పనికి రెండు గంటలు వెచ్చించాల్సి ఉంటుంది.
Promoted Content