
Arjuna Patram / అర్జునపత్రం
సురసేవితాయనమః అర్జునపత్రం సమర్పయామి తెలుగులో మద్ది. శాస్త్రీయ నామము టెర్మినాలియా అర్జున(Terminelia Arjuna) సంస్కృతంలో కకుభామ, అర్జునునికి కల నామములన్నిదీనికున్నాయి. ఇది అడవుల లో పెరుగే పెద్ద వృక్షము. తెలుపు, నలుపు వర్ణములలో ఉంటుంది. దీనిని గృహ నిర్మాణమునకు, గృహోపకరణ ములకు వాడతారు. దీని ఆకులు మర్రి ఆకులను పోలి ఉంటాయి. రక్తదోషము, ప్రమేహము, క్షయవ్యాధుల యందు మరియు హృదయ రోగములందు విశేషముగా వాడతారు.
Arjuna Patram