
అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu
మన జీవితం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది. మన ప్రవర్తన, జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మనకుగా మనం కొన్ని మంచి కట్టుబాట్లను లేదా పద్ధతులను ఏర్పరుచుకుని వాటికి లోబడి ఉండాలి.
వాటిని అతిక్రమించినప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మనకు మనం బుద్ధిచెప్పుకోవాలి. నియమ నిబంధనలను అతిక్రమించినప్పుడు నిజాయోతీగా ఎలా ప్రవర్తించాలో అర్జునుని ద్వారా ఈ కథలో నేర్చుకుంటాం.
5. నారదుడు చెప్పిన నియమాలు
స్వయంవరం లో అర్జునుడు ద్రౌపదీదేవిని గెలుచుకుని వచ్చిన తరువాత శాస్త్ర ప్రకారం ఆమె పాండవులు అయిదుగురికీ భార్య అయింది.
ఆమె పాండవులలో ఒక్కొక్కరికీ నిర్దిష్టమైన కాలం పాటు ధర్మపత్నిగా ఉంటుంది. ఆ సమయం లో మిగతావారు ఆమెను పరకాంతగా భావించాలి, ఎట్టి పరిస్థితులలోనూ ఆమె మరొకరి భార్యగా ఉన్నప్పుడు ఆమెను చూడరాదు.
ఒకవేళ చూస్తే సంవత్సరకాలం కఠిన వ్రత నియమాలతో తీర్థయాత్రలకు వెళ్ళాలి. అని నారదుడు పాండవులకు నియమాలను వివరించాడు. వారంతా ఆ నియమాలకు అంగీకరించారు.