మరణించాక ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పునర్జన్మ పొంది ఉంటాడు కదా! అలాంటప్పుడు ఇంకా ఆబ్దికాలెందుకు?

0
2521

మరణించాక ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పునర్జన్మ పొంది ఉంటాడు కదా! అలాంటప్పుడు ఇంకా ఆబ్దికాలెందుకు?

ఆబ్దికాలకు రెండు ప్రధాన ప్రయోజనాలు. ఒకటి-గతించిన జీవులకు పాత జన్మల బంధువుల ద్వారా కొంత పుణ్యం సంక్రమించడం. దానికోసం సోమలోకము అనే నామాంతరం గల పితృలోకంలో ఒక వ్యవస్థ ఉంది. అక్కడ సోముడు, పితృమాన్, యముడు, అంగిరాస్వన్, మొదలైన పితృదేవతలు ధూః, విలోచనుడు, మొదలైన విశ్వేదేవతలుఅకారులు.

ఈ భూలోకంలో పితృకర్మలు జరిగినపుడు ఇంటి భోక్తలకు ఏ తృప్తి కలిగిందో దాన్నిపుణ్యంగా పరిణమింపచేసి, గతించిజీవి ఇప్పుడు ఏ లోకంలో ఏ రూపంలో వున్నాడో గమనించి, ఆ పుణ్యాన్ని ఆ జీవియూక్క ప్రస్తుతరూపానికి, లోకానికి  అనువైన ఆహారంగా మార్చి, అందిచేయడం ఈ దేవతల పని.

అందువల్ల గతించిన జీవికి వేరే జన్మ కలిగినా, ఇక్కడ పూర్వ జన్మ పుత్రాదులు పెట్టే ఆబ్ధికాలు వర్ధ్యం కాదు. ఇక ఆబ్ధికాలకు గల రెండవ ప్రధాన ప్రయాజనం – కర్తలకు  పుణ్యాభివృద్ది. ఇది కృతజ్ఞతా ధర్మానికి కనిష్ఠ రూపం. అందువల్ల గతించిన వారికి వేరే జన్మ కలిగినా సరే, పుత్రాదులు తమ జీవితాంతం ఆబ్ధికాదులను ఆచరించడం – కర్తలకు, వారి సంతతికి, శుభదాయకం.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here