
అష్ఠాదశ శక్తిపీఠాలు ఏవి? | Ashtadasa Shakti Peetas In Telugu
సతీదేవి శరీరంలోని..18 భాగాలు .. 18 వేర్వేరు ప్రదేశాల్లో పడగా .. శ్రీఆదిశంకరాచార్యులు .. ఈ18 స్దలాలకు ప్రాణప్రతిష్టాపన చేశారు.అవే 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి.
లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హా పురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగల్య గౌరికా
వారణాస్యం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనం
సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం
- లంకలోని శక్తిని.. శాంకరీ దేవి అంటారు..
- కంచిలోని అమ్మవారిని.. కామాక్షీ దేవి అని పిలుస్తారు..
- ప్రద్యుమ్నంలోని మహాశక్తిని.. శృంఖలా దేవి అని..
- మైసూర్లోని అమ్మవారిని చాముండేశ్వరీ దేవియని..
- అలంపూర్లో.. జోగులాంబా దేవిగా..
- శ్రీ శైలంలోని శక్తిపీఠాన్ని.. భ్రమరాంబదేవి పేరుతో..
- కొల్హాపూర్ దేవిని.. మహాలక్ష్మి అని..
- మాహుర్లోని శ్రీశక్తిని.. రేణుకా దేవిగా..
- ఉజ్జయిని అమ్మవారిని.. మహంకాళి దేవి పేరుతో పిలుస్తారు..
- పీఠాపురం దేవిని.. శ్రీ పురుహూతికాదేవి అని..
- ఓడ్యాణంలోని అమ్మను.. గిరిజాదేవి అని..
- ద్రాక్షారామంలోని దేవిని.. మాణిక్యాంబదేవిగా..
- గౌహతిలోని శక్తిపీఠాన్ని.. కామరూప దేవిగా..
- ప్రయాగలో ఉన్న అమ్మను.. మాధవేశ్వరీ దేవి అని..
- జ్వాలాముఖిలోని శక్తిని.. వైష్ణోదేవిగా..
- గయలోని శక్తిపీఠాన్ని.. సర్వమంగళా దేవిగా..
- వారణాసిలోని అమ్మవారిని.. విశాలాక్షిదేవిగా..
- కాశ్మీరంలోని దేవిని.. సరస్వతీ దేవిగా మనం ఆరాధిస్తూన్నాం..