ఉబ్బసం (ఆస్త్మా) పై విజయం | Ayurveda Tips For Asthma in Telugu

0
2679
ఉబ్బసం (ఆస్త్మా) పై విజయం | Ayurveda Tips For Asthma in Telugu
Back

1. ఉబ్బసం

ఉబ్బసం సర్వసాధారణంగా కనిపించే వ్యాధి. ప్రతి వంద మందిలోనూ దాదాపు 10 నుంచి 20 మంది ఉబ్బసంతో బాధపడుతున్నారని అంచనా.

క్రమంగా ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. చికిత్సాపరంగాను, వ్యాధి నిర్ధారణ పరంగాను ఈ వ్యాధి మీద అవగాహన పెరుగుతున్నప్పటికీ, వ్యాధి కారక మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

ఆస్తమా అనేది గ్రీకు పదం. త్వరత్వరగా గాలి పీల్చడమని ఈ పదానికి అర్థం. శ్వాస ప్రక్రియ కష్టంగా తయారై ఆయాసం రావటం ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపించే లక్షణం.

జన సామాన్యంలో ఆస్తమాను ఉబ్బసం అంటారు. ఊపిరి తిత్తులకు దారితీసే శ్వాస నాళాల్లో వాపు తయారై ఇన్ ఫ్లమేషన్ కలిగించినప్పుడు ఉబ్బసం వస్తుంది.

ఉబ్బసం ఉగ్రరూపం దాల్చినప్పుడు గాలిని చేరవేసే మార్గాలు సన్నగా తయారై కుంచించుకుపోతాయి. దీనితో సునాయసంగా జరగాల్సిన శ్వాస ప్రక్రియ కాస్తా అనాయసంగా మారుతుంది.

ఇలాంటి ఉదృతి రూపాలను ఆస్మా ఎటాక్గా చెప్పుకోవచ్చు.

చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఉబ్బసం వ్యాధి సాధ్యాసాధ్యతల గురించి చెబుతూ ‘యాప్యస్తమక శ్వాస‘ అని పేర్కొంది.

అంటే తమకు శ్వాస అనేది యాప్య వ్యాధి అనీ, ఈ వ్యాధికి గురైనప్పుడు తగిన చికిత్సలతో కాల’యాప’న చేస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచాల్సి ఉంటుందనీ అర్థం.

కాగా కొత్తగా మొదలైన వ్యాధిని సరైన చికిత్సతో పూర్తిగా తగ్గించవచ్చుఅంటుంది. ఒకవేళ రోగికి శారీరక దుర్బలత్వం ఉన్నా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా కొత్తగా మొదలైనప్పటికీ యాప్య స్థితికి చేరుకుని చివరకు చికిత్సకు లొంగకుండా అసాధ్యమైన వ్యాధిగా మారుతుందనీ హెచ్చరిస్తోంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here