ఉబ్బసం (ఆస్త్మా) పై విజయం | Ayurveda Tips For Asthma in Telugu

0
2186
ఉబ్బసం (ఆస్త్మా) పై విజయం | Ayurveda Tips For Asthma in Telugu

2. చికిత్స నివారణ

ఆహార నియమాలు

  • ఆస్తమా ప్రధానంగా ఎలర్జీ సంబంధమైనది కనుక ఎలర్జీని కలిగించే ఆహారాలను గుర్తించి మానేయాలి. అలాగే కఫాన్ని పెంచే ఆహార పదార్థాలను కూడా తగ్గించాలి. ఉదాహరణకు జామ, అరటి మొదలైన పండ్లు. అలాగే చేపలు, గుడ్లు, బఠాణీలు, చిక్కుళ్ళు మొదలైన వాటికి కూడా దూరంగా ఉండాలి. కొంతమందికి పాలు సరిపడకపోవటంవల్ల కఫం పెరిగి ఆస్త్మా ఎక్కువవుతుంది. పాలకు సమానభాగం నీటిని చేర్చి రెండు, మూడు పిప్పళ్ళను నలగగొట్టి కలిపితే పాలకు ఉండే ఆమదోషం పోతుంది. అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంథం ఉబ్బసం వ్యాధిలో అనుములు, మినుములు, పెరుగు, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, పుల్లగా ఉండే పదార్ధాలు, చల్లటి పదార్థాలు తదితరాలను నిషేధించింది. ఇవన్నీ శ్లేష్మాన్ని పెంచుతాయి.
  • ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలను తినకూడదు. ఆహారం తీసుకున్న తరువాత రెండు, మూడు గంటల అనంతరం వచ్చే త్రేన్పు రుచి వాసన వంటివి లేకుండా ఉంటే (ఉద్గార శుద్ధి) ఆహారం సకాలంలో జీర్ణమవుతున్నట్లు అర్థం.
  • తీపి, పులుపు, ఉప్పు రుచులు కలిగిన ఆహారాలు కఫాన్ని, తద్వారా ఉబ్బసాన్ని పెంచుతాయి. ఇటీవల జరిగిన శాస్త్రాధ్యయనాలు సైతం ఆస్తమా విషయంలో ఉప్పును ఒక దోషిగా తేల్చాయి.
  • ఆహారపదార్థాల రుచిని పెంచటం కోసం మెటాబైసలైట్, మోనోసోడియం గ్లుటామేట్ (అజనామోటో) వంటివి వాడకూడదు.
  • వేడినీళ్లకు శ్వాస మార్గపు కండరాలను సడలించే శక్తి ఉంది. కనుక అప్పుడప్పుడు వేడినీళ్ళు తాగుతుండాలి.
  • కాఫీలో ఉంటే ఘాటైన పదార్థాలవల్ల శ్వాసమార్గాలు వ్యాకోచం చెందుతాయి. ఆస్తమా ఎటాక్ వచ్చే ముందు ఒక కప్పు వేడి కాఫీ తాగితే ఉపశమనం కలుగుతుది. అయితే దీనిని అలవాటుగా మాత్రం చేసుకోకూడదు.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here