
Purna Kumbha mela Astrological Significance
పూర్ణ కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సమయం లో ఆధ్యాత్మిక దైవిక శక్తులు ఆ పుణ్యనదులలో ప్రవహిస్తాయి. కుంభమేళా సందర్భంగా ఎంతోమంది సాధువులు, మునులు, యోగులు దర్శనమిస్తారు. సాధారణంగా వారిని దర్శించుకోవడం సులభసాధ్యం కాదు. కానీ కుంభమేళా సమయం లో వారే దైవస్వరూపులై దిగివచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు. కుంభమేళా లో పాల్గొనడం మోక్షదాయకం. సర్వపాపహరం. సూర్య చంద్రులు మరియు బృహస్పతుల స్థానాలను బట్టి కుంభమేళాను నిర్వహిస్తారు.
దైవభూమిగా పిలవబడే ఉజ్జయిని లోని క్షీప్రా నదీ కుంభమేళా అత్యంత విశిష్టమైనది. అందుకే కొన్ని లక్షలమంది ఈ పూర్ణకుంభమేళాలో పాల్గొంటారు. సూర్యుడు మేష రాశిలోనూ, బృహస్పతి సింహా రాశిలోనూ ఉన్నపుడు క్షీప్రానదికి కుంభమేళా నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి నుండీ వైశాఖ శుక్ల దశమి వరకు ఈ మహా ఉత్సవం జరుగుతుంది.