బొదకాలు వ్యాధికి ఆయుర్వేదపరమైన నివారణ | Ayurveda Tips for filaria in Telugu

0
6505
12522971_1699081817040774_6065010474105569434_n
బొదకాలు వ్యాధికి ఆయుర్వేదపరమైన నివారణ | Ayurveda Tips for filaria in Telugu

బోదకాలు (Filariasis

బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని ‘మైక్రోఫైలేరియా’ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాల (Toxins) వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. ఈ బాధలు వచ్చిన ప్రతిసారీ నాలుగైదు రోజులుండి తగ్గిపోతాయి. కానీ మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి.

ఆయుర్వేదపరమైన నివారణ

* ఉమ్మెత్త ఆకులు, ఆముదపు ఆకులు , నల్లవావిలి ఆకులు, తెల్లగలిజేరు, మునగపట్ట, తెల్లయావాలు, వీనిని సమబాగాలుగా ఉదకముతో ( నీరు ) నూరి లేపనం చేసిన చిరకాలం నుండి ఉన్న బోదకాలు వ్యాధి నశించును.

* తెల్ల ఆవాలు, దేవదారు చెక్క, మునగపట్ట, శొంటి సమాన బాగాలుగా తీసుకుని వాటిని ఆవుపంచితంతో నూరి వాపు గల కాళ్ళకు పై పూత పూచిన బోదకాలు మానును .

* బెల్లము ఒకటిన్నర తులము , పసుపు తులము, వడకట్టిన గోమూత్రం మూడు తులములు కలిపి రోజు రెండు పూటలా కొద్దిగా సేవిస్తున్న ఏనుగు కాలు వ్యాధి తగ్గును.

* వావిలి , గలిజేరు , ఆముదము, ఉమ్మెత్త,మునగ ఆకులు సమబాగాలు గా తీసుకుని మర్దించి ఆ మిశ్రమంతో లేపనం చేసిన దీర్ఘకాలం నుండి ఉన్న బోదకాలు అయినా తగ్గును .

* పత్తి చెట్టు వేర్లు గంజితో నూరి ఆ గంధమును పూచిన బోదకాలు హరించును.

* తిప్పతీగ, శొంటి , కటుకరోహిని , దేవదారు చెక్క, వాయువిడంగాలు, సమబాగాలు గా తీసుకుని వీటిని గోమూత్రము తో నూరి ఈ మిశ్రమముతో లేపనం చేయుచున్న బోదకాలు వ్యాధి తగ్గును .

* జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అంగారకుడు, బుదుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల ప్రభావం వలన బోదకాలు వ్యాధి కలుగును. కావున ఈ గ్రహముల ప్రీతీ కొరకు ఆయా దానాలు చేయడం వలన కూడా వ్యాధి తీవ్రత తగ్గుతుంది . దానితో పాటు పైన చెప్పిన యోగాలలో మూలికలు ఉపయొగించుకొని వ్యాధి నుంచి బయటపడవచ్చు.

* మొదటి దశలొ ఉన్న బోదకాలు వ్యాధి తగ్గడానికి వేపాకు , గోంగూర ఈ రెండూ కాని లేకపొతే వేపాకు పసుపు ఈ రెండు మెత్తగా దంచి నూరి బోద వ్యాధి ఉన్నచోట లేపనం చేస్తూ లొపలికి కూడా వేపాకు , పసుపు సమానంగా కలిపిన కషాయాన్ని తాగుతూ ఉంటే బోదకాలు వ్యాధి తగ్గిపోతుంది .

* పసుపు , బెల్లం సమాన బాగాలుగా కలిపి ఆవు మూత్రంతో పుచ్చుకుంటూ ఉంటే బోదకాలు వ్యాధి తగ్గుతుంది .

* బొప్పాయి ఆకులు నూరి వెచ్చ చేసి కట్టిన బోదకాలు హరించును. ఇలా కొంతకాలం చేస్తూ ఉండాలి.

* తెల్ల ఆముదం ని నూనెలో వేయించిన కరక్కయాలని పొడిచేసి గోముత్రంతో వారం రోజులు సేవించిన బోదకాలు తగ్గును .

* తెల్ల జిల్లేడు వేళ్ళని గంజిలో నూరి రాసినా బోదకాలు తగ్గును .

 

courtesyhttps://www.facebook.com/ayurvedhamoolikaarahasyaalu/photos/pcb.1699081863707436/1699081817040774/?type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here