దేహపుష్టికి ఆయుర్వేదపరమైన కొన్ని సులభమైన పద్దతులు | Ayurveda Tips for Fitness in Telugu

0
5107
1428456112739
దేహపుష్టికి ఆయుర్వేదపరమైన కొన్ని సులభమైన పద్దతులు | Ayurveda Tips for Fitness in Telugu

దేహపుష్టికి :

బహుబల రసాయనం –

నల్ల తుమ్మ చెట్టు బెరడు సేకరించి నీడలో బాగా ఎండబెట్టి దంచి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి అతి మెత్తటి చూర్ణం గా తయారు చేసుకొవాలి .

దాన్ని ప్రతిరోజు మూడు పూటలా పూటకు 5 గ్రా చూర్ణం 20 గ్రా చూర్ణం 20 గ్రా తేనేతో కలుపుకుని సేవిస్తూ ఉంటే క్రమంగా శరీరమంత వజ్రదేహం అవుతుంది.

నీరసం లేకుండా –

రాత్రి పూట ఒక గ్లాస్ మంచి నీళ్లలో 30 ఎండు కిస్మిస్ పండ్లు , ఒక ఎండు ఖర్జూరం ( విత్తనం తీసి ) వేసి మూతపెట్టి ఉంచాలి.

ఉదయం నిద్ర లేచేప్పటికి ఆ పండ్లలోని శక్తి అంత మంచినీటిలో కలిసి ఉంటుంది. పండ్లు తోముకోగానే ముందుగా ఆ గ్లాస్ లొని పండ్లు తిని ఆ నీళ్లు తాగాలి.

దీనివల్ల రక్తం శుభ్రపడుతుంది. విపరీతమైన శక్తి పెరుగుతుంది. ఎంతపని చేసినా అలసట నీరసం రాకుండా ఉంటుంది.

నరాల బలహీనతకు –

అశ్వగంధ చూర్ణం రెండు టీ స్పూన్లు , పటికబెల్లం చూర్ణం ఒక స్పూన్ , మంచి నెయ్యి ఒక టీ స్పూన్ ఒక గ్లాస్ పాలలో కలిపి రోజుకు రెండు సార్లు తాగుతూ ఉంటే నరముల బలహీనత తగ్గిపొతుంది.

నరాలకు అధ్బుతమైన శక్తి కలుగుతుంది. నీరసం తగ్గుతుంది . కండలు పెరుగుతాయి.

మంచి పుష్టికి –

రోజు రెండు పూటలా సునాముఖి (నేల తంగేడు) చూర్ణం రెండున్నర గ్రాముల పటికబెల్లం పొడితో కలిపి తింటూ ఉంటే శరీరానికి అమిత పుష్టి చేకూరుతుంది .

ప్రసవించిన స్త్రీల పుష్టికి –

సంవత్సరం పాటు నిలువ ఉన్న పాత బెల్లాన్ని , ప్రసవించిన స్త్రీలతో మితంగా తినిపిస్తూ ఉంటే అతి కొద్దిరోజులలో నే ప్రసవ స్త్రీలు సహజ శక్తిని పొందుతారు.

మంచి దేహపుష్టికి – నారీ కేళ పాయసం.

కావలసిన పదార్దాలు –

* ఆవుపాలు – 1 లీటరు
* కొబ్బరి చిప్ప – 1
* ఆవునెయ్యి – 50 గ్రా .
* పటికబెల్లం – 50 గ్రా .
* యాలుకలు – 10 గ్రా .
* లవంగాలు – 5 గ్రా .
* వేయించిన గసగసాలు – 10 గ్రా .
* పచ్చ కర్పూరం – 2 గ్రా .
* మిరియాలు – 1 గ్రా .
* కుంకుమ పువ్వు – అర గ్రా .
* ఎండు ద్రాక్ష – 20 గ్రా .
* జీడిపప్పు – 20 గ్రా .
* నాగకేసరాలు – 5 గ్రా .
* తేనే – 50 గ్రా .

తయారీ విధానం –

పై పదార్ధాలలో 5, 6, 7, 9 ,13 సంఖ్యల పదార్దాలను కొంచం దోరగా వేయించి దంచి జల్లించి వస్త్రగాలితం చేసి పెట్టుకొవాలి.

కొబ్బరిచిప్పను సన్నగా తురిమి సిద్దం చేసుకోవాలి . జీడిపప్పులను చిన్నచిన్న ముక్కలు చేసి ఉంచుకొవాలి.

కళాయి పాత్రని పొయ్యి మీద పెట్టి పాలు పోసి మరిగించి అందులో ముందుగా కొబ్బరితురుము , పటికబెల్లం వేసి ఉడకబెట్టాలి.

ఉడికిన తరువాత పైన సిద్దం చేసిన పదార్దాలను ఒక్కొక్కటిగా వరుసగా వేసి కలపాలి. తరువాత జీడిపప్పు ముక్కలను , ద్రాక్ష ముక్కలను , ఆవునేతిని కలపాలి.

ఈ పదార్దాలు చల్లారిన తరువాత లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనే ని కలిపితే నారికేళ పాయసం అవుతుంది.

వాడే విధానం –

ఈ పాయసాన్ని ఇంటిల్లపాది పిల్లలు, పెద్దలు , అందరూ సేవించవచ్చు ఈ పాయసాన్ని ఒక పూట ఆహారంగా గాని , అల్పాహారం గా గాని సేవించ వచ్చు.

ఎవరి జీర్ణశక్తిని బట్టి పిల్లల వయసుని బట్టి తగుమోతాదులో ఈ పాయసాన్ని సేవించ వచ్చు.

ప్రయోజనాలు –

ఇది తినడానికి ఎంతో రుచిగా ఉండి మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. శరీరంలో అధిక వేడిని అణిచి వేసి చలువ కలిగిస్తుంది. శరీరంలో అధిక వాతం అనగా గ్యాస్ వంటి చెడు వాయువుల్ని నిర్మూలించి పుష్టిని కలిగిస్తుంది. పురుషులకు అంతులేని వీర్యబలాన్ని అఖండమైన వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ఈ నారీకేల పాయసాన్ని అప్పుడప్పుడు మితిగా సేవిస్తూ ఉంటే శరీరానికి అమిత పుష్టి చేసి ఎటువంటి క్రూర వ్యాధులు దరిచేరవు.

కాళహస్తి వెంకటేశ్వరరావు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here