దేహపుష్టికి ఆయుర్వేదపరమైన చిట్కా | Ayurveda Tips for Fitness in Telugu

1
22055
5
దేహపుష్టికి ఆయుర్వేదపరమైన చిట్కా | Ayurveda Tips for Fitness in Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

దేహపుష్టికి రసలాపానకం –

వంద గ్రాముల పెరుగు , ఆవునేతిలో దోరగా వేయించిన మిరియాల చూర్ణం 5 గ్రాములు ఈ మూడు కలిపి బాగా చిలికితే పానకం లా తయారవుతుంది.

దీనిని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే శరీరానికి అగ్నిదీప్తి, కాంతి , పుష్టి కలుగుతాయి.

సన్నగా ఉన్నవాళ్లు లావు కావాలంటే –

ప్రతిరోజు పదిహేను గ్రాముల అశ్వగంధ చూర్ణం ఒక గ్లాస్ పాలలొ దానితో పాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , తగినంత పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే క్రుశించిపోయిన వారు బాగా కండ పట్టి వీర్యవంతులు , బలవంతులు అవుతారు.

రసాయన సిద్ధి – దేహ వృద్ది.

ప్రతిరోజు నువ్వుల పప్పు, పటికబెల్లం పొడి ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచుకొని ఉదయం పూటే తింటూ ఉంటే క్రమంగా శరీరానికి రసాయనిక సిద్ది కలుగుతుంది.

ఆరోగ్య పుష్టికి –

గింజలు తీసిన ఖర్జురపు కాయలు 30 గ్రాములు , గసగసాలు 30 గ్రాములు , బాదంపప్పు 20 గ్రాములు , యాలుకల గింజల పొడి 5 గ్రాములు పటికబెల్లం పొడి 50 గ్రాములు ఆవువెన్న 30 గ్రాములు ఈ వస్తువులు అన్ని కలిపి మెత్తగా నూరి ఆ వస్తువుల మొత్తం కొలతలో సగం కొలతగా ఆవునెయ్యి కలిపి బాగా కలపాలి.

తరువాత ఆ ఔషదాన్ని ఒక సీసాలో గాని జాడీలో గాని భద్రపరచుకొని ప్రతిరోజు ఉశిరికాయ ప్రమాణంలో ఉదయమే సేవిస్తూ ఉంటే మెదడు రోగాలు , ఉడుకులు హరించిపొయి శరీరతత్వం బాగుపడి బలము, ఆరొగ్యం పుష్టి కలుగుతాయి.

దేహ పుష్టి , దేహ సౌందర్యం కొరకు –

ఒక గ్లాస్ లొ ఇరవై గ్రాముల ఎండు కిస్మిస్స్ పండ్లు వేసి ఒక నిమ్మకాయ రసం పిండి ఆ గ్లాస్ లొ సగం వరకు మంచి నీళ్లు పోసి మూతపెట్టి తెల్లవారే వరకు నానబెట్టి ఉంచాలి.

ఉదయం ముఖం కడుక్కోగానే ఆ పండ్లు తిని ఆ నీళ్లు తాగుతూ ఉంటే నలబై రొజుల్లొ అమితమైన బలం కలుగుతుంది.

ఆయుర్వేద ఫలం –

ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తరువాత రెండు గంటలు ఆగి తరువాత 5 సీమ బాదం కాయలలోని పప్పులు కొంచం పటికబెల్లం , గింజలు తీసిన 6 ఎండు ద్రాక్ష పండ్లు నమిలి తినాలి .

ఈ విధముగా క్రమం తప్పకుండా 20 రోజులు చేస్తే ఒంటికి మంచి బలం చేకూరుతుంది .

కాళహస్తి వెంకటేశ్వరరావు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here