
Gastric Troubles Remedies
ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్య లేనివారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక యంత్రాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒక వేళ అహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించటం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టక పోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండానే కోపం రావటం వంటి మానసిక సమస్యలతో బాటు సరైన అహారం తీసుకోక పోవటంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి అందరిని వేధిస్తోంది.
1. లక్షణాలు:
- గ్యాస్‌తో పొట్ట అంతాఉబ్బరంగా ఉండి పొట్టలో గడబిడలు మొదలవుతాయి.
- తేన్పులు ఎక్కువగా రావడం.
- తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం.
- మలబద్దకం ఏర్పడటం.
- జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం.
- వాంతులు అవడం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు మానసిక స్థాయిలో కోపం, చిరాకు, నిద్రలేమి,
- నిరాసక్తత ఉండి అంతర్మధనం చెందుతారు.
Promoted Content