రక్తపోటు ( BP ) నివారణకు ఆయుర్వేదపరమైన చిట్కాలు | Ayurveda Tips for BP in Telugu

0
4922

 

download
రక్తపోటు ( BP ) నివారణకు ఆయుర్వేదపరమైన చిట్కాలు | Ayurveda Tips for bp in Telugu

శొంటి పొడుము , ధనియాలు పాలతో గాని , అల్లము , జీలకర్ర, ధనియాలు కషాయం చేసి చల్లర్చినది ఒక మండలం ( 41 రోజులు ) తాగవలెను.

వెల్లుల్లి రసం పాలలొ కలిపి రెండు పూటలా త్రాగవలెను . వాటి మోతాదు వెల్లుల్లి రసం 10 చుక్కలు , పాలు ఒక ఔన్స్ కలిపి ఒక మండలం త్రాగవలెను . ఇది ఒక్క రక్తపోటు కొరకే కాకుండా పక్షవాతముకి కూడా పనిచేయును . వాతవ్యాదులు దగ్గరకి రానివ్వదు.

 శొంటి పొడుము ని రెండు రెట్లు పంచదార గాని బెల్లం న గాని పాకం పట్టి ఉంచుకొనవలెను. తరువాత దానిని రోజు కుంకుడు కాయ అంత తినుచుండిన చాలా మంచిది.

బావన అల్లం , బావన జీలకర్ర మూడు పూటలా రెండు కలిపి ఒక చెంచా తీసుకొనవలెను.

గమనిక –
వాతం కలగజేసే పదార్దాలను అనగా చామగడ్డ, వేరుసెనగ వంటి వాటిని తినకుండా ఉన్నచొ ఔషదం శక్తివంతంగా పనిచేస్తుంది.

జటా మామ్సి అనే మూలిక తెచ్చి దానిని మెత్తగా దంచి చూర్ణం చేసుకొని పూటకు 2 గ్రాముల మొతాదుగా మంచి నీళ్లతో వెసుకుంటూ ఉంటే LOW BP తగ్గిపొతుంది.

నల్ల ఈశ్వరి వేరుని పొడిచేసి పుటకు 250 మిల్లి గ్రాముల చొప్పున మంచి నీళ్లతో రోజుకీ రెండుపూటలా సేవించిన రక్తపోటు నివారించ బడును.

courtesy https://www.facebook.com/ayurvedhamoolikaarahasyaalu/photos/a.1690468414568781.1073741827.1690453367903619/1700685126880443/?type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here