ఆయుర్వేదపరం గా ఇంగువ | Ayurvedic Health Benefits of Asafoetida in Telugu

0
11637
ఆయుర్వేదపరం గా ఇంగువ | Ayurvedic Health Benefits of Asafoetida in Telugu
Ayurvedic Health Benefits of Asafoetida in Telugu

Ayurvedic Health Benefits of Asafoetida in Telugu

ఇంగువ చాలా ఒగరుగా ఉంటుంది.

ఇంగువ లో సల్ఫర్ యోగికాలు ఉంటాయి కనుక గాఢమైన వాసన వస్తుంటుంది. దీని వాసనలోని గాఢత ఉల్లిపాయ వాసనని మించి ఉంటుంది. దీనిని ఆహార పదార్థాల తయారీకి వాడుతుంటారు. అలాగే మసాలాల తయారీలో కూడా ఇది ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.

ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించుట, బాధనివారిణి, యాంటీమైక్రోబియాల్, విరేచనకారిగా, నరాల ఉత్తేజకమందు, కఫ౦ తగ్గించేది, ఉపశమన౦ కల్గించేదిగా కూడా పేరొందింది.
పిప్పి పన్ను

ఇంగువను కొద్దిగా వేయించి పిప్పి పన్ను మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది.
బహిష్టు నొప్పి (మక్కలశూల)
ఇంగువను నేతిలో వేయించి తీసుకుంటే బహిష్టు నొప్పి తగ్గుతుంది.

మలేరియా జ్వరం

ఇంగువకు పాత నెయ్యి కలిపి గాఢంగా వాసన చూస్తే మలేరియాలో ఉపశమనం లభిస్తుంది.

ఇంగువకు సౌవర్చల లవణం కలిపి తీసుకుంటే కడుపునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి కషాయానికి ఆముదం వేర్లు, బార్లి, పుష్కర మూలం, ఇంగువ కలిపి తీసుకున్న కడుపునొప్పి తగ్గుతుంది.
ఆకలి తగ్గటం (అగ్నిమాంద్యం)
ఇంగువ, త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, సైంధవ లవణం ఈ ఎనిమిదింటినీ సమానంగా తీసుకొని పొడిచేసి వేడి నీళ్లతో తీసుకోవాలి. దీనిని హింగ్వాష్టక చూర్ణం అంటారు.

ఉన్మాదం

నెయ్యిలో ఇంగువ, ఇంగువ ఆకులు, కరక్కాయ, బ్రాహ్మీలను వేసి వేడిచేసి తీసుకోవాలి.

మద్యపానంలో మత్తు దిగడానికి
సౌవర్చల లవణానికి ఇంగువ, మిరియాలు కలిపి పుల్లని మజ్జిగతో తీసుకుంటే మద్యపానం తరువాత వచ్చే మత్తు దిగుతుంది.

చెవి నొప్పి

ఆవ నూనెకు ఇంగువ, శొంఠి కలిపి వేడిచేసి చెవిలో వేసుకుంటే చెవి నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. లేదా హింగ్వాది తైలాన్ని కూడా వాడవచ్చు.
ఉదరంలో పెరుగుదలలు (గుల్మం)
హింగ్వాది చూర్ణం, హింగ్వాది గుటిక, హింగుత్రిగుణ తైలం వంటివి వాడాలి.

జీర్ణ వ్యవస్థ వ్యాధులు

గ్యాస్‌ని వెలువరింపచేసే తత్వం ఇంగువకు ఉంటుంది. గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగించే ఓషధుల్లో ఇది ముఖ్యమైన ఓషధి. ఆహారం జీర్ణం కాకపోవటం, కడుపునొప్పి వంటి సమస్యల్లో ఇంగువను ఉపయోగించవచ్చు. పొట్ట ఉబ్బరించి గ్యాస్‌తో నిండిపోయినప్పుడు ఇంగువను బాహ్య ప్రయోగంగా వాడి ప్రయోజనం పొందవచ్చు. ముందుగా ఇంగువను వేడినీళ్లలో కరిగించాలి. ఒక గుడ్డను ఈ నీళ్లలో తడిపి ఉదర కండరాలపై పరిచి కాపడం పెట్టుకోవాలి. గ్యాస్ మరీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే ఇంగువ కలిపిన నీళ్లను ఎనిమా మాదిరిగా తీసుకోవచ్చు.

  1. ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్ణ, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  2. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యల నొప్పి, సక్రమంగా లేని,బాధతోకూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన ఔషదంల పని చేస్తుంది.
  3. పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధులు తగ్గడం కోసం తేనే, అల్లంతో కూడిన ఇంగువ వాడితే ఉపశమనం లభిస్తుంది.
  4. గ్లాస్ నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులను తగ్గిస్తుంది.
  5. గ్లాస్ నిమ్మరసం లో చిన్న ఇగువ కలిపి తీసుకుంటే పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
  6. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  7. భోజనానం తరువాత ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
  8. పళ్ళు పుచ్చిపోయి ఉంటే రాత్రి పడుకునేముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే క్రిములను మటుమాయం చేస్తుంది.
  9. ఇంగువ చాలా ఒగరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
  10. మనం తినే ఆహారం లో ప్రతి రోజు ఇంగువ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మనం ఆరోగ్యవంతంగా ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here