
ayurvedic remedies for migraine
2. కారణాలు
మైగ్రెయిన్ తలనొప్పికి స్పష్టమైన కారణాలు తెలియవు. అయితే వాతావరణపరమైన అంశాలు, జన్యుపరమైన సమస్యలు మొదలైనవాటిని కొన్నిటిని వైద్య శాస్త్రవేత్తలు కారణాలుగా భావిస్తున్నారు.
ఆయుర్వేదంలో “అసాత్మేంద్రియార్థ సంయోగం’ అనేదాన్ని ఒక ప్రధాన హేతువుగా చెప్పారు. చూపు, రుచి, వాసన, స్పర్స వంటి జ్ఞానేంద్రియ విధులు అసహజమైన రీతిలో జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది. వీటిని గమనించి తగినచర్యలు తీసుకోవడం ద్వారా మైగ్రెయిన్ తగ్గించుకోవచ్చు.
మైగ్రెయిన్ బయటపడడానికి ముందు తలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ముందుగా శరీరాంతర్గతమైన లేదా వాతావరణపరమైన అంశం ప్రేరకంగా పనిచేస్తుంది.
నాడీ వ్యవస్థ దీనికి ప్రతిస్పందించి విద్యుదావేశాన్ని మెదడంతా పరుచుకునేలా చేస్తుంది. విద్యుత్ చర్యవల్ల మెదడులోని కణజాలాలు కొన్నిరకాల జీవరసాయనాలను విడుదల చేస్తాయి.
వీటివల్ల రక్తనాళాలు ఉబ్బిపోయి పటిష్టతను కోల్పోతాయి. వీటి గోడల నుండి ప్రేరకపదార్ధాలు తప్పించుకొని మెదడు అడుగుకు చేరుకొని అక్కడ ఉండే నొప్పిగ్రాహక కేంద్రాలను చేరుకొని తలనొప్పికి కారణమవుతాయి. ఇది మైగ్రెయిన్ ప్రాప్తించే విధానాన్ని తెలిపే ఒక ప్రతిపాదిత సిద్ధాంతం (హైపోధిసిస్).