Ayurvedic Treatment for Mental Stress
2. మానసిక ఒత్తిడి వ్యాధా? వ్యాధి కారకమా?
మనిషి తన దైనందిన జీవన విధానంలో మార్పు కోసం శారీరకంగా, మానసికంగా అతిగా స్పందించడాన్ని ఒత్తిడి అంటారు. ఈ ఒత్తిడిని సరిగ్గా గుర్తించకపోవడంతో రోజురోజుకూ ఒత్తిడి ఎక్కువై మనస్సు మీద విపరీత ప్రభావాలను చూపి అనేక శారీరక, మానసిక వ్యాధులను కలుగజేస్తుంది.
చిన్నవయస్సులో జుట్టు తెల్లబడటం, జట్టు రాలడం, బి.పి, సుగర్ వంటి వ్యాధులబారిన పడటం, చర్మ సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. కనుక మానసిక ఒత్తిడి వ్యాధిని పెంచే ఒక కారణం మాత్రమే కానీ, వ్యాధి కాదు.
కారణాలు
మానసిక ఒత్తిడి కలగడానికి కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
- మితిమీరిన దైనందిన యాంత్రిక జీవన విధానం
- నిత్యకృత్యాలలో సరైన ప్రణాళికలు లేకపోవడం
- సరైన నిద్ర ఉండకపోవడం
- ఆహారపు అలవాట్ల అదుపు తప్పడం
- మద్యంపానం, ధూమపానం, ఇతర మత్తు పదార్ధాలకు అలవాటు పడటం
- ఒంటరితనం, ఆత్మన్యూనతాభావం
- అసత్యం, హింస, పాప ప్రవృత్తి, దుర్భాష లాడటం,
- ఇంద్రియ, మనో నిగ్రహాలను కోల్పోవడం
- కేన్సర్, గుండె, చర్మ సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటిని చాలా రోజులుగా అనుభవిసూ ఉండటం
చిన్న పిల్లల్లో :
చదువులో పోటీ తత్వం పెరగడం, పరీక్షలు తప్పడం
యుక్త వయసులో :
స్నేహం, ప్రేమ విఫలం కావడం, ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం, పెళ్లి, సంసారం
ఉద్యోగుల్లో :
విపరీతమైన పని ఒత్తిడి, తీవ్ర మానసిక శ్రమ
మహిళల్లో :
పని ఒత్తిడి, ఉద్యోగంలో అభద్రతాభావం, ప్రేమ, పెళ్లి, విడాకులు, సంసారంలో ఒడిదుడుకులను భారిమ్చాలేకపోవడం, పిల్లలు కలుగకపోవడం, రుతుక్రమంలో అధిక మార్పులు.