ఆయుర్వేదం ప్రకారం పసుపు ఆరోగ్య ప్రయోజనాలు | Ayurvedic Benefits of Turmeric Power in Telugu

0
7668
Turmeric root and powder on white background
ఆయుర్వేదం ప్రకారం పసుపు ఆరోగ్య ప్రయోజనాలు | Ayurvedic Benefits of Turmeric Power in Telugu

పసుపుతో ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు..

పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.

పసుపుతో నీరుకలిపి మెత్తగా పేస్ట్ లా చేసి క్రమంగాలోనికి తీసుకుంటే శరీరానికి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేధం వెల్లడిస్తోంది.పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను హరిస్తుంది.

సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంటలాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది. సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుపుకు ఎంతో ఋణపడి ఉన్నాయి.

వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
మెత్తగా పేస్టులా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమవుతుంది.

ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

ఎక్కువ సేపు నీటిలో ఉంటేపాదాలు నానిపగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపసమనం  కలిగిస్తుంది.

వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.

పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి.
ఇలా చేస్తే చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.

వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.

పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది

పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.

వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here