అయుత మహా చండి యాగం | Ayutha Chandi Yagam in Telugu

0
5339

ayutha chandi yagam
లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, ల యకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్త మం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకం బరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతా మూర్తులకు సప ్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని చేయడానికి చాలామంది సాహసించరు.

చండీ యాగం విశేషాలు
కలియుగంలో గణపతి, చండి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్పారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, లక్ష చండీ యాగం చేస్తారు. చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. గత 200 ఏళ్లలో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటిసారి శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సమయంలో చేస్తే.. రెండోసారి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నారు. సాధారణంగా గణపతి హోమం, అయుష్య హోమం, మృత్యుంజయ హోమం తదితరాలను ఎవరో ఒక దేవుడు లేదా దేవతను ఉద్దేశించి చేస్తారు. కానీ, చండీ యాగంలో మాత్రం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ముగ్గురికీ కలిపి పూజలు నిర్వహిస్తారు. చండీ దేవత చాలా ప్రచండ శక్తి. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదని, దుఖం అనేది రాదని, ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవని వేదాలు చెబుతున్నాయి. అయుత చండీ యాగంలో పది వేల పారాయణలు, కోటి నవార్ణ మంత్ర జపం చేస్తారు.

పారాయణలో పదో వంతు హోమం, పదో వంతు తర్పణాలు ఇస్తారు. శత చండీ యాగంలో పది మంది; సహస్ర చండీ యాగంలో వంద మంది; అయుత చండీ యాగంలో వెయ్యి మం ది రుత్విక్కులు పాల్గొంటారు. అన్ని యాగాల్లోనూ మొదటి నాలుగు రో జులూ ప్రతిరోజూ నవావరణ పూజ, చతుష్షష్టి యోగినీ పూజ, దీప స హిత బలి, కల్పోక్త పూజతోపాటు కుంకుమార్చన చేస్తారు. ఐదో రోజు అ గ్ని ప్రతిష్ట చేసి, ఆహుతులతో అమ్మవారికి పరమాన్న ద్రవ్యంతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి, ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, క న్యక పూజలు, అవభృత్యం, అన్న సంతర్పణతో హోమాన్ని పూర్తి చేస్తారు. అయుత చండీ యాగాన్ని 100 హోమ కుండాలతో చేస్తారు. యజమాని హస్త ప్రమాణం ఆధారంగా తీసుకుని చేస్తారు. దీనిని వంద సృక్‌లు, 1000 సృవలతో చేస్తారు. సృక్‌, సృవాలు అంటే హోమంలో నెయ్యిని వేయడానికి ఉపయోగించే పాత్రలు. 4000 కిలోల బియ్యం, 5000 కిలోల బెల్లం, 4000 కిలోల నెయ్యి తదితరాలతో శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమ ద్రవ్యాలను ఉపయోగిస్తారు.

యాగ ప్రదేశంలో విధినిషేధాలు.
నవార్ణ మంత్ర ఉపదేశం తీసుకున్న పరమ నిష్టాగరిష్ఠులైన 1500 మంది రుత్విక్కులు అయుత చండీ యాగంలో పాల్గొంటున్నారు. ప్రా రంభం నుంచి పరి సమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. యాగశాలలో పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. బ్రహ్మచర్యం పాటిస్తారు. రెండు పూటలా స్నానం చేస్తారు. ఇక యాగ ప్రాంతానికి చేరుకున్న ప్రతి ఒక్కరూ యాగ పవిత్రతను కాపాడాలి. అయితే, రజస్వల, బహిష్టు అయినవాళ్లు, జాతాశౌచం, మృతాశౌచం ఉన్నవాళ్లు, ఈ నియమాలను ఇంటి వద్ద పాటించని ఇతర బంధుగణం యాగస్థలికి రాకూడదు. యాగ ప్రదేశానికి మద్యం, మాంసం సేవించి రాకూడదు. యాగ పరిసరాల్లో ధూమపానం నిషేధం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here