బాల శివాజీ – గో రక్షణ | Shivaji Protects Holy Cow

0
3969

చత్రపతి వీర శివాజీ 12 యేండ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఒక రోజు బీజాపూర్ వెళ్తుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది, ఒక కసాయివాడు ఒక గోమాత ను చంపే ప్రయత్నంలో ఉన్నాడు. గోమాత ప్రాణభయంతో ఆతురతతో అటు ఇటు పారిపోవాలని ప్రయత్నిస్తుండగా ఆ కసాయివాడు దానిని కోపంతో మాటిమాటికి కర్ర తో కొట్టసాగాడు. గోవును మాతగా భావించే హిందువులు నిస్సహయులై, తలవంచుకొని బాధ పడుతూ చూస్తూ ఉండగా బాల శివాజీ ముందుకు వచ్చి తన ఓర నుండి కత్తి తీసి కసాయివాడి దగ్గరకు వెళ్లి గోమాత మెడకు ఉన్న తాడుని కోసివేశాడు, గోమాత పరిపాయింది. కసాయి కోపం తో ముందుకు వచ్చి ఏదో చెప్పబోతుండగానే అతని తల తెగి నెల మీద పడిపోయింది. అతని శరీరం కుప్పకులినది. ఈ వార్త రాజ్యం మొత్తం క్షణాల్లో వ్యాపించినది. నవాబు కోపంతో ఉగిపోయాడు, తన రాజ్యం నుండి శివాజీని  బయటకు పంపివేయాలని అతని తండ్రి శహాజి ని ఆదేశించాడు.

shivaji-protects-holy-cow
బాల శివాజీ – గో రక్షణ | Shivaji Protects Holy Cow

శివాజీ బీజాపూర్ వదిలిపెట్టాడు కానీ హిందుసామ్రాజ్య స్థాపన అయిన అతని ఆశయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. చివరికి ఆ రోజు వచ్చింది. బీజాపూర్ సుల్తాన్ శివాజీని తన రాజ్యం లో వున్నస్వతంత్ర హిందు సామ్రాట్టుగా గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ ఏనుగు పై ఊరేగుతూ బీజాపూర్ లోని రాజ్యమర్గాముగుండా ధర్బారులోకి ప్రవేశించాడు. నవాబు అతని ముందుకు వచ్చి శిరస్సు వంచి సలాం పెట్టి స్వాగతం పలికాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here